అక్షరటుడే వెబ్డెస్క్: Cauvery Water Dispute | కావేరీ నదీ జలాల వివాదంపై కర్ణాటక ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సీఎం నివాస కార్యాలయం ‘కృష్ణ’లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రయోజనాలే తమకు మొదటి ప్రాధాన్యమని నేతలు స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా రైతుల సంక్షేమం కోసం అందరం ఐక్యంగా నిలవాలని నిర్ణయించారు. తాగునీటి అవసరాలకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని సీఎం డీకే శివకుమార్ తెలిపారు. అలాగే, కావేరి అథారిటీ (CWMA) సమావేశానికి ముందు కేంద్ర మంత్రులు, మాజీ సీఎంలతో మాట్లాడి రాష్ట్ర వాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.
Cauvery Water Dispute | హాజరైన ముఖ్య నేతలు..
ఈ అఖిలపక్ష సమావేశానికి మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, బి.ఎస్. యడియూరప్ప, హెచ్.డి. కుమారస్వామి, వీరప్ప మొయిలీ, సదానంద గౌడలతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు మరియు ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. న్యాయపరమైన, పరిపాలనాపరమైన చర్యలపై వీరంతా విస్తృతంగా చర్చించారు.
ಕಾವೇರಿ ನೀರಿನ ವಿಷಯಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಸನ್ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ @DKShivakumar ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಗೃಹ ಕಚೇರಿ ‘ಕೃಷ್ಣಾ’ದಲ್ಲಿ ಸರ್ವಪಕ್ಷಗಳ ಸಭೆ ನಡೆಯುತ್ತಿದೆ.
ರಾಜ್ಯದ ಹಿತಾಸಕ್ತಿಯನ್ನು ಕಾಪಾಡುವ ಉದ್ದೇಶದಿಂದ ನಡೆಯುತ್ತಿರುವ ಈ ಸಭೆಯಲ್ಲಿ ಸರ್ವಪಕ್ಷಗಳ ಮುಖಂಡರು, ಕಾವೇರಿ ಜಲಾನಯನ ಪ್ರದೇಶದ ಮಾನ್ಯ ಕೇಂದ್ರ ಸಚಿವರು,… pic.twitter.com/ixoDVr5lV3
— CM of Karnataka (@CMofKarnataka) August 2, 2026
ఇది కూడా చదవండి: Dichpally Lorry Accident | జాతీయ రహదారిపై లారీ బోల్తా