అక్షరటుడే, వెబ్డెస్క్ : Lashkar Bonalu | సికింద్రాబాద్లో లష్కర్ బోనాల జాతర ఘనంగా సాగుతోంది. మహంకాళి అమ్మవారికి నగరవాసులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు.
బోనాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్నారు. ఆయనకు అధికారులు, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు.
Lashkar Bonalu | ప్రత్యేక పూజలు చేసిన కేటీఆర్
మహంకాళి అమ్మవారి ఆలయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు బాగా పడాలని ప్రార్థించినట్లు తెలిపారు. బోనాలను బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర పండుగగా గుర్తించామన్నారు.
Lashkar Bonalu | భక్తజన సందడి
లష్కర్ బోనాల నేపథ్యంలో నగరంలో సందడి నెలకొంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి భారీగా భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.
Revanth Reddy prays at Secunderabad Mahankali Temple
Chief Minister Revanth Reddy visited the historic Ujjaini Mahankali Temple in Secunderabad during the Ashada Bonalu festival. He offered prayers to the Goddess and asked for her blessings for the state’s prosperity.
He was… pic.twitter.com/ycwFM2q2AX
— Hyderabad Mail (@Hyderabad_Mail) August 2, 2026
ఇది కూడా చదవండి : Tanvi Sharma | తైపీ ఓపెన్.. చరిత్ర సృష్టించిన తన్విశర్మ