Brij Bhushan Acquitted | రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసు.. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఊరట

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Brij Bhushan Acquitted | మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో, బీజేపీ మాజీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్​కు ఊరట లభించింది. ఆయనతో పాటు వినోద్ తోమర్‌లను ఢిల్లీ (Delhi)లోని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం నిర్దోషులుగా విడుదల చేసింది.

WFI చీఫ్‌గా సింగ్ పదవీకాలంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లర్లు గతంలో నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. రెజ్లర్ల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేసిన అనంతరం ఢిల్లీ పోలీసులు 2023 జూన్ 15న 1500 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు.

Brij Bhushan Acquitted | మహిళా రెజ్లర్ల ఆరోపణలతో..

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అధిపతిగా ఉన్న సమయంలో సింగ్ తమను లైంగికంగా వేధించారని భారత్​, విదేశాలకు చెందిన మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలకు సంబంధించి నిందితులు విచారణను ఎదుర్కొంటున్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ రౌస్ అవెన్యూ కోర్టుల అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ACJM) అశ్విని పన్వార్ ఉత్తర్వులను జారీ చేశారు.

ఇది కూడా చదవండి..: Government Exams Amendment 2026 | ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలకు ఇక చెక్: సవరణ చట్టం-2026కి రాష్ట్రపతి ఆమోదం..అధికారిక గెజిట్ విడుదల!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *