అక్షరటుడే, వెబ్డెస్క్: Karnataka Cabinet Expansion | కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం 20 మంది జాబితాను విడుదల చేసింది. స్పీకర్గా జీఎస్ పాటిల్, డిప్యూటీ స్పీకర్గా పొన్నన్నను నియమించింది.
రెండు నెలల క్రితం సీఎంగా డీకే శివకుమార్ (DK Shivakumar) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా చేపడుతున్న ఈ విస్తరణలో, ఆయన తన మంత్రివర్గంలో మరో 20 మంది నాయకులను చేర్చుకోనున్నారు. ఈ జాబితాలో చాలా మంది కొత్త వారు ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన కుల, ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని మంత్రులను ఎంపిక చేశారు. ఈ రోజు సాయంత్రం 4:05 గంటలకు మంత్రులు ప్రమాణం చేయనున్నారు.
Karnataka Cabinet Expansion | కొత్త మంత్రులు వీరే..
కొత్తగా చేరనున్న నాయకులలో పి.ఎం. నరేంద్రస్వామి, శివరాజ్ తంగడగి, రుద్రప్ప లమాని, కె.ఎస్. బసవంతప్ప, టి. రఘుమూర్తి, మధు బంగారప్ప, పుట్టరంగ శెట్టి మరియు మంకాల్ ఎస్. వైద్య ఉన్నారు. షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ మాజీ మంత్రి బి. నాగేంద్ర మంత్రివర్గంలోకి తిరిగి రానున్నారు. 2018లో కాంగ్రెస్లో చేరిన నాగేంద్ర, వాల్మీకి డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణల కారణంగా 2024లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. బి.జెడ్. జమీర్ అహ్మద్ ఖాన్, రిజ్వాన్ అర్షద్, ఎన్. చలువరాయ స్వామి, కె.ఎం. శివలింగే గౌడ, హెచ్.సి. బాలకృష్ణ, యతీంద్ర శాంతేగౌడ, బసవరాజ్ రాయరెడ్డి, విజయనంద కాశప్పనవర్, లక్ష్మణ్ సవది మరియు ఎస్.ఎస్. మల్లికార్జున్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇది కూడా చదవండి..: Student Protest | జార్ఖండ్లో విద్యార్థుల పోరాటానికి సీజేపీ మద్దతు