Stock Market Today | ఎఫ్ఐఐ కొనుగోళ్ల మద్దతు.. భారీగా పెరిగిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో సెషన్‌లోనూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 544 పాయింట్లు, నిఫ్టీ 390 పాయింట్లు పెరిగాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Today | అమెరికా -ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందన్న ఆశలతో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతోపాటు దేశీయ స్టాక్ మార్కెట్‌లో విదేశీ సంస్థాగత మదుపరులు వరుసగా నాలుగు సెషన్లుగా నికర కొనుగోలుదారులుగా నిలవడం, రూపాయి విలువ బలోపేతం అవుతుండడం, కంపెనీల మొదటి త్రైమాసిక ఫలితాలు అంచనాలకు మించుతుండడంతో మార్కెట్ పాజిటివ్ గా సాగుతోంది.

Stock Market Today | భారీ గ్యాప్ అప్‌లో ప్రారంభం..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 789 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా మొదట్లో ఒడిదుడుకులకు లోనై 386 పాయింట్లు తగ్గింది. కనిష్టాలనుంచి కోలుకుని 398 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 189 పాయింట్ల లాభంతో ప్రారంభమై 67 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 259 పాయింట్లు పైకి ఎగబాకింది. నిఫ్టీ చివరి నిమిషంలోనూ 200 పాయిట్లు పెరగడం గమనార్హం. చివరికి సెన్సెక్స్ 544 పాయింట్ల లాభంతో 78,639 వద్ద, నిఫ్టీ 390 పాయింట్ల లాభంతో 24,774 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Today | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,837 కంపెనీలు లాభపడగా 1,552 స్టాక్స్ నష్టపోయాయి. 206 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 187 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 67 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 21 స్టాక్ లాభపడగా.. 9 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఇండిగో 4.22 శాతం, టీసీఎస్ 3.57 శాతం, ఇన్ఫోసిస్ 3.54 శాతం, ఎటర్నల్ 2.53 శాతం, ఐటీసీ 1.90 శాతం లాభపడ్డాయి.

Top Losers : సన్‌ఫార్మా 1.98 శాతం, ఎయిర్‌టెల్ 1.02 శాతం, మారుతి 0.95 శాతం, టాటా స్టీల్ 0.37 శాతం, ఎం అండ్ ఎం 0.32 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Samsung Galaxy F70 Pro | మిడ్ రేంజ్‌లో శాంసంగ్ నుంచి మరో ఫోన్..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *