Hanuman Farm Substation | ప్రారంభానికి సిద్ధమైన హనుమాన్ ఫాం విద్యుత్ ఉపకేంద్రం

హనుమాన్ ఫాం గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్​: Hanuman Farm Substation | నవీపేట్ మండలం (Navipet Mandal)లోని హనుమాన్ ఫాం గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది. ట్రాన్స్​కో చీఫ్ ఇంజనీర్ (కన్స్ట్రక్షన్) చౌహాన్ జైవంత్​రావు, జిల్లా ఎస్ఈ పీవీ రాజేశ్వరరావు సోమవారం సాంకేతిక తనిఖీలు నిర్వహించారు.

Hanuman Farm Substation | ఉపకేంద్రం ఛార్జ్​..

ఎలాంటి లోపాలు లేవని నిర్ధారించిన అనంతరం వారిరువురు ఉపకేంద్రాన్ని ఛార్జ్ చేశారు. ​ఈ ఉపకేంద్రం ద్వారా హనుమాన్ ఫాం, పోతంగల్ గ్రామాలకు, చుట్టుపక్కల ప్రాంతాల వ్యవసాయ, గృహ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందుతుందని చీఫ్ ఇంజనీర్ తెలిపారు. ​ఈ కార్యక్రమంలో డిఫెన్స్, ఆపరేషన్స్, కన్​స్ట్రక్షన్​ విభాగాల అధికారులు ఎం. శ్రీనివాసరావు, డి. వెంకటరమణ, స్వామి, తోట రాజశేఖర్, జి. ప్రశాంత్ రెడ్డి, కె. నటరాజ్, ఏ. కాశీనాథ్, ఆనంద్, జి. శ్రీనివాస్, భాస్కర్ ప్రసాద్, సీనియర్ లైన్ ఇన్​స్పెక్టర్​ నరేందర్ నాయక్  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Police Prajavani | పోలీస్​ ప్రజావాణికి 30 ఫిర్యాదులు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *