Prashant Kishor | బీజేపీకి షాక్​..​ ఉప ఎన్నికల్లో ప్రశాంత్​ కిశోర్​ ఘన విజయం

బీజేపీకి షాక్​ తగిలింది. ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్​ అసెంబ్లీ స్థానంలో ప్రశాంత్​ కిశోర్​ గెలుపొందారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Prashant Kishor | బీహార్​లో బీజేపీకి షాక్​ తగిలింది. 40 ఏళ్లుగా ఆ పార్టీ గెలుస్తున్న స్థానంలో తాజాగా జన్​ సురాజ్​ పార్టీ (JSP) అధ్యక్షుడు ప్రశాంత్​ కిశోర్​ ఘన విజయం సాధించారు.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​ గతంలో అనేక పార్టీలకు పని చేశారు. అధికారంలోకి రావడంలో కృషి చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తన పార్టీ జన్​ సురాజ్​ అభ్యర్థులను గెలిపించుకోలేక పోయారు. అయితే ఉప ఎన్నికల్లో బంకీపూర్​ (Bankipur ) స్థానం నుంచి పీకే ఘన విజయం సాధించారు. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రంలోని, బీజేపీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలో ఆయన గెలుపొందడం గమనార్హం. అంతేగాకుండా గతంలో ఇక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్​ నబిన్ (Nitin Nabin)​ గెలుపొందారు. ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లారు.

Prashant Kishor | 30 ఏళ్లుగా కంచుకోట

బీజేపీ సిట్టింగ్​ స్థానాన్ని కోల్పోయింది. గత 30 ఏళ్లుగా ఇక్కడ బీజేపీకి తిరుగులేదు. అంతేగాకుండా పార్టీ జాతీయ అధ్యక్షుడు గతంలో పోటీ చేసిన సీటును తాజాగా కమలం పార్టీ కోల్పోయింది. బంకీపూర్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన కిషోర్, బీహార్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యను మెరుగుపరిచే, ఉపాధిని కల్పించే నాయకత్వాన్ని ఎంచుకోవాలని ప్రజలు బీజేపీకి సందేశం ఇచ్చారని ఆయన అన్నారు.

Prashant Kishor | జెన్​–జీ కీలక పాత్ర

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన భారీ విద్యార్థి నిరసనల తర్వాత ఈ ఎన్నిక జరిగింది. ఈ నిరసనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో ‘జెన్-జెడ్’ సమస్యలు కీలక పాత్ర పోషించాయి. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థి నీరజ్​ కుమార్​పై పీకే గెలుపొందారు. 20 వేల ఓట్లకు పైగా మెజార్టీతో ప్రశాంత్‌ కిషోర్‌ విజయం సాధించారు. 1995 నుంచి బంకీపూర్‌లో బీజేపీ ఎప్పుడు ఓడిపోలేదు.

దీనిని కూడా చదవండి : Samsung Galaxy F70 Pro | మిడ్ రేంజ్‌లో శాంసంగ్ నుంచి మరో ఫోన్..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *