అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Rain Forecast | కామారెడ్డి జిల్లాలో గత 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు కామారెడ్డిలో కూడా అతి భారీ వర్షం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
Kamareddy Rain Forecast | మళ్లీ వాన
కామారెడ్డి జిల్లా (Kamareddy District)లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినట్లు ఐఎండీ తెలిపింది. గతంలో టీజీడీపీఎస్ (TGDPs) డేటా ప్రకారం కామారెడ్డి కలెక్టరేట్ వద్ద 182.8 మి.మీ, పిట్లం, మక్దుంపూర్, సర్వాపూర్ ప్రాంతాల్లోనూ 118 మి.మీలకు పైగా వర్షం నమోదై చాలా భారీ వర్షంగా నమోదైంది. గాంధారి, తాడ్వాయి, కొల్లూర్ తదితర మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది.
Kamareddy Rain Forecast | దక్షిణ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో..
దక్షిణ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 5.8 కి.మీ ఎత్తులో, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, కోస్తా ఆంధ్రా పరిసరాల్లో 4.5 కి.మీ ఎత్తులో ఎగువ గాలి చక్రవాతాలు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఈనెల 4,5,6 తేదీల్లో కామారెడ్డిలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 7న కొన్ని ప్రాంతాల్లో, ఆగస్టు 8 నుండి 10 వరకు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో రైతులు వాతావరణ సూచనలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ పనులు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు.
Kamareddy Rain Forecast | జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు
కామారెడ్డి జిల్లాలో గత 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ప్రకారం ఆగస్టు 3 ఉదయం 8:30 నుండి ఆగస్టు 4 ఉదయం 8:30 వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రమైన కామారెడ్డిలోని కలెక్టరేట్ వద్ద అత్యధికంగా 182.8 మి.మీ వర్షం కురవగా, పిట్లంలో 127.0 మి.మీ, మహ్మద్‌నగర్ మండలం మక్దుంపూర్‌లో 124.8 మి.మీ, గాంధారి మండలం సర్వాపూర్‌లో 118.0 మి.మీ వర్షం నమోదైంది.
దీంతో ఈ నాలుగు ప్రాంతాల్లో చాలా భారీ వర్షంగా నమోదైంది. ఇక గాంధారిలో 111.8 మి.మీ, తాడ్వాయిలో 95.3 మి.మీ, రామలక్ష్మణ్‌పల్లిలో 91.3 మి.మీ, కొల్లూరులో 86.0 మి.మీ, నస్రుల్లాబాద్‌లో 82.0 మి.మీ, బిర్కూర్‌లో 76.8 మి.మీ, బొమ్మన్ దేవిపల్లిలో 76.0 మి.మీ, హసన్‌పల్లిలో 74.8 మి.మీ, సదాశివనగర్‌లో 71.0 మి.మీ, లచ్చాపేట్‌లో 70.3 మి.మీ, ఎలుపుగొండలో 67.3 మి.మీ, పాత రాజంపేట్‌లో 66.3 మి.మీ వర్షం కురిసి భారీ వర్షం కురిసింది. ఇసాయిపేట్, పెద్ద కోడప్ గల్, ఆర్గోండ, భిక్కనూర్, లింగంపేట్, పుల్కల్, మచాపూర్, డోంగ్లి, నాగిరెడ్డిపేట్, బిచ్కుంద, దోమకొండ, బిబిపేట్, జుక్కల్, సోమూర్, మెనూర్ ప్రాంతాల్లో 18.0 మి.మీ నుండి 61.8 మి.మీ వరకు మోస్తరు వర్షం నమోదైంది.
ఇది కూడా చదవండి..: Nizamabad Police | వర్షాల నేపథ్యంలో పోలీసుల సేవలు అభినందనీయం: సీపీ సాయిచైతన్య