అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy elderly woman death | కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న కొటారి గల్లీలో 70 ఏళ్ల వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వృద్ధురాలి తల వెనుక భాగంలో బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైనట్లు సమాచారం. దీంతో ఆమె మృతి ప్రమాదవశాత్తు కిందపడటంతో జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Kamareddy elderly woman death | చైన్ స్నాచింగ్ కోణంలో విచారణ
వృద్ధురాలి వద్ద నుంచి చైన్ లాక్కునే ప్రయత్నంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను కిందకు తోసివేసి ఉండొచ్చన్న అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. చైన్ స్నాచింగ్ జరిగిందా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
TGSPDCL power demand | తెలంగాణలో విద్యుత్ డిమాండ్ దూకుడు.. TGSPDCL చరిత్రలో సరికొత్త రికార్డు
Kamareddy elderly woman death | రద్దీ ప్రాంతంలో ఘటన
కొటారి గల్లీలో సెకండ్‌హ్యాండ్ మొబైల్ ఫోన్ల వ్యాపారం అధికంగా ఉండటంతో సాధారణంగా ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. అదే సమయంలో ఆకతాయిల ఆగడాలు, మందుబాబులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ స్థానికులు గతంలో ఆరోపించినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలించడంతో పాటు స్థానికులను విచారిస్తున్నారు. వృద్ధురాలి మృతికి కచ్చితమైన కారణం ఏమిటనేది పోలీసుల దర్యాప్తు, తదుపరి ఆధారాల ఆధారంగా తేలాల్సి ఉంది.