Amala Paul comments | హీరోయిన్ల అభ్యంతరకర సీన్లపై అమలాపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇప్పుడు అలాంటి పాత్రలు చేయనంటూ!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Amala Paul comments | దక్షిణాది సినిమాల్లో హీరోయిన్లను అభ్యంతరకరంగా చూపించే సన్నివేశాలపై తరచూ చర్చ జరుగుతూనే ఉంటోంది. తాజాగా ఈ అంశంపై నటి అమలాపాల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లను ఎలా పిక్చరైజ్‌ చేయాలన్నది సినిమా కథ, దర్శకుడి ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

Amala Paul comments | ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పుపట్టొద్దు

హీరోయిన్లను అభ్యంతరకరంగా చూపిస్తున్నారనే కారణంతో మొత్తం సినీ పరిశ్రమను నిందించడం సరికాదని అమలాపాల్ పేర్కొన్నారు. ప్రతి సినిమా కథ, దాని నేపథ్యం, దర్శకుడి విజన్‌ వేర్వేరుగా ఉంటాయని చెప్పారు. అందుకే ఒక సినిమాలోని సన్నివేశాలను ఆధారంగా చేసుకుని మొత్తం ఇండస్ట్రీని బ్లేమ్‌ చేయకూడదని అభిప్రాయపడ్డారు.

Amala Paul comments | లేడీ ఓరియెంటెడ్ సినిమాలు పెరగడం శుభపరిణామం

ప్రస్తుతం మహిళా ప్రాధాన్యం ఉన్న కథలు, లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు పెరుగుతుండటం మంచి పరిణామమని అమలాపాల్‌ అన్నారు. కథలో హీరోయిన్ల పాత్రలకు మరింత ప్రాధాన్యం లభించడం సంతోషకరమని పేర్కొన్నారు.

TGSPDCL power demand | తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ దూకుడు.. TGSPDCL చరిత్రలో సరికొత్త రికార్డు

Amala Paul comments | ‘ఆడై’పై అమలాపాల్‌ ప్రస్తావన

ఇదే సందర్భంలో తన కెరీర్‌లో చేసిన ప్రయోగాత్మక చిత్రం ‘ఆడై’ గురించి కూడా ఆమె మాట్లాడారు. ఆ సినిమాలో నగ్నంగా నటించడం అప్పట్లో ఎంతో రిస్క్‌తో కూడుకున్న నిర్ణయమని చెప్పారు. అయితే ప్రస్తుతం అలాంటి పాత్రను చేయాల్సి వస్తే తాను ఆలోచించాల్సి ఉంటుందని, బహుశా చేయకపోవచ్చని అమలాపాల్‌ పేర్కొన్నారు.

అప్పట్లో సాహసోపేతమైన పాత్రను ఎంచుకున్న అమలాపాల్‌.. ఇప్పుడు అదే తరహా పాత్ర విషయంలో వెనక్కి తగ్గుతానని చెప్పడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *