అక్షరటుడే, ఇందూరు: Bonalu Festival | నగరంలోని(Nizamabad ) గుమస్తా కాలనీలో (Gumasta Colony) మంగళవారం అంగరంగ వైభవంగా బోనాల పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవార్లకు బోనాలు సమర్పించారు.
Bonalu Festival | అర్చకులు ఆర్యన్ తివారీ ఆధ్వర్యంలో..
గుమస్తా కాలనీలో దుర్గమ్మ బోనాల మహోత్సవాన్ని ఆలయ అర్చకులు ఆర్యన్ తివారి ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు సమర్పించగా, యువకులు, చిన్నారులు, కాలనీ వాసులు, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఆలయ అధ్యక్షుడు ఆమంద్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ ‘తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పండుగ మనందరిలో భక్తి, ఐక్యత, సేవాభావాన్ని పెంపొందిస్తుందన్నారు.
సమాజంలో సనాతన ధర్మ పరిరక్షణ, భారతీయ సంస్కృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గుమస్తా కాలనీ ప్రజలు ప్రతి ఏడాది ఇదే ఉత్సాహంతో బోనాల మహోత్సవాన్ని నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గుమస్తా కాలనీ ప్రధాన కార్యదర్శి బోడికే బాబురావు కోశాధికారి ధాత్రిక వేణుగోపాల్, లవంగ సదాశివ, ఉపాధ్యక్షుడు మాడూరి కిషన్, శ్రీకరి సంతోష్, గంగోనె అనిల్, కార్యదర్శి అమంద్ వెంకట్, చోటే రాజేష్, సలహాదారులు ధాత్రిక రాజేందర్, కార్యవర్గ సభ్యులు గంగోనె సంతోష్, మెడికల్ శ్రీనివాస్, ధాత్రిక ప్రవీణ్, నవీన్, రాజేష్, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: EPFO PF Portal | పీఎఫ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆధార్ ఆధారిత కొత్త డిజిటల్ పోర్టల్ తెచ్చిన ఈపీఎఫ్‌ఓ