POCO M8 Power 5G | భారీ బ్యాటరీతో పోకో ఫోన్ విడుదల

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: POCO M8 Power 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ పోకో.. భారత మార్కెట్ లో మరో కొత్త మోడల్ ను విడుదల చేసింది. పోకో ఎం8 పవర్ 5 జీ పేరుతో తీసుకువచ్చిన ఈ ఫోన్‌లో అధునాతన ప్రాసెసర్, భారీ బ్యాటరీ అమర్చారు. ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ఆగస్ట్ 7 ప్రారంభం కానుంది. ఫ్లిప్ కార్ట్ (Flipkart)తో పాటు పోకో ఇండియా వెబ్ సైట్ లో అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.

డిస్‌ప్లే : 6.83 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే అమర్చారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 2396 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్స్ కలిగి ఉంది.
కార్నింగ్ గొరిల్లా 7ఐ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఐపీ65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ సర్టిఫికెట్ ఉంది.

POCO M8 Power 5G | ప్రాసెసర్..

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.
నాలుగు ఓఎస్, ఆరేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని కంపెనీ చెబుతోంది.

POCO M8 Power 5G | కెమెరా సెటప్..

వెనకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ తో కూడిన డ్యుయల్ కెమెరా సెట్ అప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

POCO M8 Power 5G | బ్యాటరీ సామర్థ్యం..

8000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్, 22.5డబ్ల్యూ రివర్స్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
ఒక్కసారి ఫుల్ చార్జి చేస్తే 31 గంటలపాటు సోషల్ మీడియా స్క్రోలింగ్, 28 గంటలపాటు నాన్‌స్టాప్‌గా వీడియో ప్లే చేయొచ్చని, 14 గంటలపాటు గేమింగ్‌కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ చెబుతోంది.

వేరియంట్స్ : బ్లేజ్ ఆరంజ్, బ్లాక్, గ్రీన్ కలర్స్‌లో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999.
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 27,999.

ఆఫర్లు : వెయ్యి రూపాయల కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది.
ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులతో చేసే కొనుగోళ్లపై రూ. 2,000 వరకు డిస్కౌంట్ వర్తిస్తుంది.

ఇది కూడా చదవండి..: Sensex Today | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. లాభాల్లో సెన్సెక్స్.. ఫ్లాట్ గా నిఫ్టీ

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *