KC Venugopal | స్పీకర్​ తీరుపై కేసీ వేణుగోపాల్ ఆగ్రహం

లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా తీరుపై కాంగ్రెస్​ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: KC Venugopal | లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా తీరుపై కాంగ్రెస్​ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ఆదేశాల మేరకు మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడారన్నారు.

మంత్రి కిరణ్​ రిజిజు (Minister Kiren Rijiju) అసత్యాలు మాట్లాడారని వేణుగోపాల్ ఆరోపించారు. తనకు మాట్లాడేందుకు సమయం ఇవ్వడానికి బదులుగా, ఎగతాళి చేయడం మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభాపతి ఇలా చేయడం సరికాదన్నారు. ఆయన ఒకవేళ నరేంద్ర మోదీకి పెద్ద భక్తుడుగా మారాలనుకుంటే, వేరే మార్గంలో అలా చేయవచ్చు కానీ ఇలా కాదన్నారు.

KC Venugopal | ప్రజలు నవ్వుకుంటున్నారు

రామమందిర నిధులను దోచుకున్న వారే ఇప్పుడు కాంగ్రెస్‌ను రామ విరోధిగా ఆరోపిస్తున్నారని కేసీ వేణుగోపాల్ అన్నారు. ప్రజలు దీనిని చూసి నవ్వుకుంటారని పేర్కొన్నారు. విరాళాల డబ్బును తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్​ చేస్తే.. ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తీసుకురావాల్సిన వ్యక్తి బయటకు రాకుండా ఈ భవనంలోనే దాక్కున్నారని అమిత్​ షాను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటుకు వచ్చే ధైర్యం కూడా ఆయనకు లేదన్నారు. జులై 20న విద్యార్థులపై కాల్పులు జరపమని ఎవరు ఆదేశాలు ఇచ్చారో అమిత్​ షా చెప్పాలని డిమాండ్​ చేశారు. ఆయన తప్పు చేశారు కాబట్టే సమాధానం చెప్పే స్థితిలో లేరని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Delimitation Bill | డీలిమిటేషన్​ బిల్లు కోసం పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *