Rahul Gandhi on Modi | మోదీ, అమిత్​ షాకు ధైర్యం లేదు : రాహుల్ గాంధీ

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్​ షాకు ధైర్యం లేదని లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi on Modi | ప్రధాని మోదీ (PM Modi), హోంమంత్రి అమిత్​ షా (Amit Shah)కు ధైర్యం లేదని లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ అన్నారు. ఇటీవల ఢిల్లీలో నిరసనలో పాల్గొన్న విద్యార్థులను బుధవారం ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

నిరసనల్లో పాల్గొన్న యువత నేడు మీడియా ముందుకు వచ్చారన్నారు. కానీ అమిత్ షా, ప్రధానమంత్రికి ఇక్కడ నిలబడే ధైర్యం లేదన్నారు. వారు ఇక్కడకు రావడం సాహసోపేతమైన చర్య అని అభివర్ణించారు. వేధింపులు, చిత్రహింసలను ఎదుర్కొంటున్న విద్యార్థులు తమ భావాలను ఇంత స్పష్టంగా, అద్భుతంగా వ్యక్తం చేసే ధైర్యం వారిలో ఉండటం గర్వంగా ఉందన్నారు. ఈ దేశానికి ఇలాంటి యువతే అవసరం అని పేర్కొన్నారు.

Rahul Gandhi on Modi | అమిత్​ షా బాధ్యత వహించాలి

విద్యార్థులపై హింసకు హోం మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని రాహుల్​ డిమాండ్​ చేశారు. పార్లమెంటుకు వచ్చే కనీస సంస్కారం, జరిగిన ఘటనపై స్పందించే ధైర్యం ఆయనకు లేవని విమర్శించారు. తాను కొంతమంది నిరసనకారులతో మాట్లాడినట్లు ఆయన చెప్పారు. తమపై జరిగిన దాడులు, కొట్టడం, బెదిరింపుల గురించి వారు వివరించారని పేర్కొన్నారు. వారు ధైర్యంగా పోరాడారని కొనియాడారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను కొట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఇళ్లకు గూండాలను పంపించారన్నారు. 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణ చెప్పించి ఆపై దానిని అంగీకరించడం పూర్తిగా అర్థరహితం అన్నారు. తమకు సమర్థవంతంగా పనిచేసే విద్యా విధానం కావాలని డిమాండ్​ చేశారు.

దీనిని కూడా చదవండి : Fertilizer Booking | రైతులకు అలర్ట్​.. ఇక అన్ని ఎరువులు యాప్​లో బుక్​ చేయాల్సిందే..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *