అక్షరటుడే వెబ్‌డెస్క్: Kejriwal Ethanol Allegation | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇథనాల్ బ్లెండింగ్‌కు సంబంధించిన నివేదికను వెనక్కి తీసుకోవాలని ‘సొసైటీ ఆఫ్ ఇండియా ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్’ (SIAM)పై మోదీ సర్కార్ ఒత్తిడి తెచ్చిందని గురువారం ఆరోపించారు.
Kejriwal Ethanol Allegation | కొనుగోళ్ల కోసమే బలవంతం..
శాస్త్రీయ ఆధారాలు, పరిశోధనలను పక్కనపెట్టి అమెరికా నుంచి ఇథనాల్ కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని దేశ ప్రజలపై బలవంతంగా రుద్దుతోందని కేజ్రీవాల్ విమర్శించారు. SIAM నివేదికను బలవంతంగా ఉపసంహరించుకునేలా చేయడమే ఇందుకు నిదర్శనమని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (X) ద్వారా ఆయన పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఆరోపణలను బీజేపీ నేత అమిత్ మాల్వియా తీవ్రంగా ఖండించారు. E20 పెట్రోల్ ఇంధన నాణ్యతపై సంస్థాగత చర్చలలో భాగంగా జరిగిన సంభాషణలను వక్రీకరిస్తూ కేజ్రీవాల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Kejriwal Ethanol Allegation | స్పందించిన సియామ్ (SIAM) సంస్థ..
ఈ వివాదంపై SIAM స్పష్టతనిచ్చింది. ఇంధన నాణ్యత పరిశీలన క్రమబద్ధంగా జరుగుతుందని, మీడియాలో వచ్చిన కథనాలు అసంపూర్ణ డేటా ఆధారంగా రావడంతోనే మునుపటి కమ్యూనికేషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. భారత్‌లో ఇంధన భద్రత కోసం ప్రభుత్వం చేపట్టిన E20 కార్యక్రమానికి ఆటోమొబైల్ పరిశ్రమ పూర్తి మద్దతు ఇస్తుందని సంస్థ పునరుద్ఘాటించింది.
ఇది కూడా చదవండి:Professor Jayashankar | తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్‌కు ఘన నివాళులు