Mega Job Mela | యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం నా బాధ్యత : ఎమ్మెల్యే ధన్​పాల్​

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Mega Job Mela | యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆర్మూర్ రోడ్​లోని శ్రీరామ గార్డెన్​లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

Mega Job Mela | 60కి పైగా కంపెనీలు..

ఇందులో 60కి పైగా ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పాల్గొంటున్నాయని ఎమ్మెల్యే (MLA Dhanpal) తెలిపారు. 2 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్​, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ తదితర విద్యార్హతలు కలిగిన యువతీయువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరిశ్రమలకు నిరుద్యోగులకు మధ్య వారధిగా నిలిచి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకే ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. నిజామాబాద్ యువతలో ఎంతో ప్రతిభ ఉందని, వారికి సరైన మార్గదర్శనం అందించడం తన బాధ్యత అని పేర్కొన్నారు.

Mega Job Mela | ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు

ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితిని తగ్గించేందుకు ప్రముఖ కంపెనీలను నేరుగా ఇందూరుకు తీసుకురావడం కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ధన్​పాల్​ చెప్పారు. అర్హత కలిగిన ప్రతి అభ్యర్థి బయోడేటా విద్యార్హతల ధృవపత్రాల ప్రతులు, ఆధార్ కార్డు పాస్​పోర్టు సైజు ఫొటోలతో ఉదయం 9 గంటల నుంచి హాజరుకావాలని కోరారు. అలాగే జాబ్ మేళాకు సహకరిస్తున్న కంపెనీలు, వలంటీర్లు, భాగస్వామ్య సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇది కూడా చదవండి..: GPO ACB Trap | రూ.5 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన జీపీవో

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *