అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Academic Excellence Awards | విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడమే టీవీయూవీ లక్ష్యమని సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ నిజ్జన రమేష్ ముదిరాజ్ పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అకాడమిక్ ఎక్సెలెన్స్ అవార్డుల ప్రదానోత్సవాన్ని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల (Giriraj Government College) ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.
Academic Excellence Awards | ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహం..
వివిధ విద్యాసంస్థలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అకాడమిక్ ఎక్స్లెన్స్ అవార్డులను అందజేసి సన్మానించారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆవిర్భావం, పదేళ్లుగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఉద్యమాలు, సేవా కార్యక్రమాలను వివరించారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి వారిని మరింత ఉన్నత శిఖరాలకు చేరేలా ప్రోత్సహించడమే అకాడమిక్ ఎక్సెలెన్స్ అవార్డుల ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ కవితారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదివితే విజయం తప్పకుండా సాధించగలరన్నారు. ముఖ్యంగా యువతులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. టీవీయూవీ దశాబ్ద కాలం పూర్తి చేసుకోవడం అభినందనీయమని, అవార్డులు అందుకున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత విద్యలోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. డీఐఈవో రవికుమార్ మాట్లాడుతూ చదువులో కష్టపడితే విజయం సొంతమవుతుందని పేర్కొన్నారు.
Academic Excellence Awards | చదువులో కష్టపడితే విజయం సాధించాలి
గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డా. రామ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ టీవీయూవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అకాడమిక్ ఎక్సెలెన్స్ అవార్డుల కార్యక్రమం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు. అడ్వకేట్ ఆశ నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమంలో టీవీయూవీ నాయకులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు కష్టపడి చదివి నీట్, జేఈఈ మెయిన్స్, ఈఏపీసెట్ వంటి జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షల్లో చదువులో కష్టపడితే విజయం సాధించాలని సూచించారు.
సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామవత్ లాల్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఏర్పాటై నేటితో పదేళ్లు పూర్తయ్యాయని తెలిపారు. ప్రతి ఏడాది అకాడమిక్ ఎక్స్లెన్స్ అవార్డులను ఇస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో హభా అధ్యక్షుడు విశ్వతేజస్ నవీన్, కావ్య, టీవీయూవీ జిల్లా అధ్యక్షుడు రాంపూర్ అజయ్, నగర అధ్యక్షుడు సుభాష్, వేణు, నిశ్వంత్, బన్ని, జస్వంత్, పండు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Mega Job Mela | యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం నా బాధ్యత..: ఎమ్మెల్యే ధన్పాల్