అక్షరటుడే, వెబ్డెస్క్: Wife Texted Lover | సమాజంలో రోజురోజుకు నేర ప్రవృత్తి పెరిగి పోతుంది. ముఖ్యంగా వివాహేతర సంబంధాల కోసం కట్టుకున్న వారిని కడతేరుస్తున్నారు. ప్రియుడితో కలిసి భార్యలు, భర్తలను చంపుతుండగా.. ప్రియురాలి మోజులో కట్టుకున్న భార్యను కొందరు చంపేస్తున్నారు. తాజాగా ఓ మహిళ తన భర్తను ఎలాగైనా చంపాలని ప్రియుడికి మెసేజ్ పంపింది. లేదంటే తాను చనిపోతానని పేర్కొంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
Wife Texted Lover | ఫోన్ చెక్ చేయడంతో..
మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District) డోర్నకల్లు మండలం చిలుకోడుకు చెందిన రాజేశ్వరరావుకు 2016లో సూర్యాపేట జిల్లాకు చెందిన భవానితో వివాహం అయింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సైదులు అనే కొరియర్ బాయ్తో భవాని వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో గత నెల 27న పెద్దల సమక్షంలో రాజేశ్వరరావు పంచాయితీ పెట్టాడు. అనంతరం తన అన్నను తీసుకురావడానికి రాజేశ్వరరావు వెళ్తుండగా.. అతని సైదులు వెంబడించాడు. అతడి నుంచి తప్పించుకొని ఆయన ఇంటికి వచ్చి భార్య ఫోన్ చెక్ చేశారు. తన భర్తను చంపాలని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో ప్రియుడికి తన భార్య పంపిన మెసేజ్ చూసి రాజేశ్వరరావు షాక్ అయ్యాడు.
Wife Texted Lover | పోలీసులకు ఫిర్యాదు
తన భర్తను ఎలాగైనా చంపాలని, లేదంటే తాను చనిపోతానని సైదులకు భవాని మెసేజ్ పంపింది. ఆ చాటింగ్ స్క్రీన్షాట్లు తీసుకొని.. భార్య భవాని, ఆమె ప్రియుడిపై రాజేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. మరోసారి ఠాణాను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి..: Srisailam Power Generation | శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం