Instagram CSAM Ads | చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్.. మెటాకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రకటనల్లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ ప్రచారం అవుతుండటంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Instagram CSAM Ads | ఇన్‌స్టాగ్రామ్‌ ప్రకటనల్లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ ప్రచారం అవుతుండటంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. ఈ అంశంపై మెటాతో పాటు దేశంలోని 8 రాష్ట్రాల పోలీస్ డైరెక్టర్ జనరల్స్‌ (డీజీపీ)కు నోటీసులు జారీ చేసింది. ఈ ప్రకటనలు పోక్సో (POCSO) చట్ట ఉల్లంఘనల కిందకు వస్తాయని కమిషన్ పేర్కొంది. ఇలాంటి కంటెంట్‌ను గుర్తించి తొలగించేందుకు తీసుకుంటున్న చర్యలపై తక్షణ వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Instagram CSAM Ads | చట్టపరమైన చర్యలు తప్పవు..

కంటెంట్‌లో బాలలపై లైంగిక వేధింపుల మెటీరియల్ (CSAM) ఉన్నట్లు తేలితే మెటాపై కచ్చితంగా కేసు నమోదు చేస్తామని NHRC సభ్యుడు ప్రియాంక్ కనూంగో స్పష్టం చేశారు. ఒకవేళ ఈ విషయంపై సరైన దర్యాప్తు చేపట్టకపోతే, నోటీసులు అందుకున్న పోలీసు ఉన్నతాధికారులపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రధాని మోదీ వీడియో తొలగింపు వివాదం, డీప్‌ఫేక్‌లు, బాలల భద్రత తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మెటాకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో, NHRC తీసుకున్న ఈ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

meta.1

Instagram CSAM Ads | మెటా ప్రతినిధుల భేటీ..

ఈ పరిణామాల నేపథ్యంలో మెటా ప్రపంచ వ్యవహారాల హెడ్ జోయెల్‌ కప్లన్‌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం దిల్లీలో కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పాటు పలువురు అధికారులతో సమావేశమైంది. భారత రాజ్యాంగ, న్యాయ నిబంధనలకు అనుగుణంగా మెటా వేదికలు ఎంతవరకు పనిచేస్తున్నాయన్నదానిపై అధికారులు ఆరా తీశారు. డీప్‌ఫేక్‌లు, బాలలపై లైంగిక వేధింపుల కంటెంట్, బాట్‌ అకౌంట్ల వంటి సమస్యలను తాము అత్యంత సీరియస్‌గా పరిగణిస్తున్నామని మెటా బృందం తెలిపింది. వీటి కట్టడికి తాము తీవ్రంగా శ్రమిస్తున్నామని, భవిష్యత్తులో మరింత మెరుగైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: OBC National Conference | ఓబీసీ 11వ జాతీయ మహాసభల్లో నిజామాబాద్ బీసీ శ్రేణులు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *