అక్షరటుడే వెబ్డెస్క్: Vijay Divorce Petition | తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే (TVK) అధినేత దళపతి విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారానికి తెరపడింది. విజయ్ నుంచి విడాకులు కోరుతూ గతంలో చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ను సంగీత అధికారికంగా వెనక్కి తీసుకున్నారు. ఈ విజ్ఞటనపై స్పందించిన న్యాయమూర్తి కేసును ముగిస్తున్నట్లు తీర్పు వెలువరించారు.
Vijay Divorce Petition | 27 ఏళ్ల దాంపత్య బంధం..
సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ వ్యక్తిగత జీవితంపై గత కొంతకాలంగా రకరకాల చర్చలు నడిచాయి. 1999 ఆగస్టు 25న వివాహం చేసుకున్న ఈ దంపతులకు కుమారుడు జేసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా ఉన్నారు. దాదాపు 27 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు కలిసి ఉన్న వీరిద్దరి మధ్య వ్యక్తిగత కారణాల వల్ల మనస్పర్థలు తలెత్తడంతో, సంగీత ప్రత్యేక వివాహ చట్టం కింద విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
Vijay Divorce Petition | రాజీ కుదరడంతో ఉపసంహరణ..
చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఈ కేసుకు సంబంధించి పలుమార్లు విచారణ జరిగింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య రాజీ, సామరస్య వాతావరణం కుదరడంతో కేసును ఇకపై కొనసాగించడం ఇష్టం లేక సంగీత తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. కోర్టు దీనిని ఆమోదించి కేసును ముగిస్తున్నట్లు ప్రకటించడంతో విజయ్ అభిమానులు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బిగ్ ట్విస్ట్.. విజయ్ విడాకుల పిటిషన్ వెనక్కి?
తమిళ నటుడు, టీవీకే అధ్యక్షుడు Vijay వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం, ఆయన భార్య సంగీత విడాకుల పిటిషన్ను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.… pic.twitter.com/zyHei0yFVs
— SkyC Media (@SkyCMedia) August 7, 2026
ఇది కూడా చదవండి: OBC National Conference | ఓబీసీ 11వ జాతీయ మహాసభల్లో నిజామాబాద్ బీసీ శ్రేణులు