అక్షరటుడే, కామారెడ్డి: Sevadal Appointments | రాష్ట్ర సేవాదళ్‌ను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కామారెడ్డి (Kamareddy) జిల్లాకు చెందిన పలువురు మండల, నియోజకవర్గ, టౌన్ అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని (Hyderabad) రాష్ట్ర సేవాదళ్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
Sevadal Appointments |జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో..
రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు గడ్డమీది మహేష్ కలిసి నూతన పదాధికారులకు నియామక పత్రాలను అందజేశారు. జిల్లా అధ్యక్షుడు గడ్డమీది మహేష్ ఆధ్వర్యంలో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడిగా మెహర్ బాబా గౌడ్, కామారెడ్డి టౌన్ అధ్యక్షుడిగా కొమ్మరాజుల సుదర్శన్, కామారెడ్డి మండల అధ్యక్షుడిగా ప్రణీత్ కుమార్ నియమితులయ్యారు.
అలాగే రాజంపేట మండల అధ్యక్షుడిగా వేణుగోపాల చారి, పాల్వంచ మండల అధ్యక్షుడిగా హరీష్, మాచారెడ్డి మండల అధ్యక్షుడిగా మలోత్ మహేష్, దోమకొండ మండల అధ్యక్షుడిగా దోర్నాల ప్రవీణ్ కుమార్, బీబీపేట్ మండల అధ్యక్షుడిగా కలకుంట్ల రాజు, భిక్కనూర్ మండల అధ్యక్షుడిగా గిజువెల్లి మాధవ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా మిద్దెల జితేందర్ మాట్లాడుతూ.. సేవాదళ్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. గ్రామస్థాయి నుంచి సంస్థను బలోపేతం చేసి ప్రజా సమస్యలపై పోరాడాలని, ప్రతి నాయకుడు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Ganga Gaya Sangam Yatra | గంగా గయ సంగమ యాత్ర.. మరో టూర్ ప్యాకేజీతో ఐఆర్సీటీసీ రెడీ