అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Wine Shops Closure | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆషాఢ బోనాలు ఘనంగా సాగుతున్నాయి. ఆదివారం బోనాల నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసి వేయాలని సైబరాబాద్ పోలీసులు ఆదేశించారు.
నగరంలో ఆదివారం బోనాల నేపథ్యంలో సోమవారం సైతం ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. నగర వ్యాప్తంగా బోనాలను ఘనంగా జరుపుకోనున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బోనాలు ముగియగా.. మరికొన్ని ఆలయాల్లో ఆదివారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ నెల 9న కూకట్‌పల్లి, అల్లాపూర్, రాయదుర్గం, జీడిమెట్ల, మేడ్చల్, చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు మూసివేయనున్నట్టు సైబరాబాద్ సీపీ (Cyberabad CP) ప్రకటించారు.
Wine Shops Closure | బార్లు, కల్లు దుకాణాలు సైతం
వైన్ షాపులతో పాటు బార్లు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉండే వైన్/కల్లు దుకాణాలు కూడా మూసి వేయాలని పోలీసులు ఆదేశించారు. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలోని బార్లకు మినహా మిగతా మద్యం దుకాణాలు అన్ని మూసి వేయాలన్నారు. బోనాల నేపథ్యంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు వైన్ షాపులు బంద్ పెట్టారు.
𝐍𝐎𝐓𝐈𝐅𝐈𝐂𝐀𝐓𝐈𝐎𝐍 pic.twitter.com/A5FqAtbavk
— Cyberabad Police (@cyberabadpolice) August 7, 2026
దీనిని కూడా చదవండి : BJP GHMC Elections | పొత్తులు లేవు.. ఒంటరిగానే పోటీ చేస్తాం: బీజేపీ చీఫ్ రాంచందర్ రావు