అక్షరటుడే, వెబ్డెస్క్: PM Modi IIT Delhi | ఢిల్లీ ఐఐటీ స్నాతకోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. విద్యార్థులకు గ్రాడ్యుయేట్ పట్టాలు ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. మన యువతను చూస్తే గర్వకారణంగా ఉందన్నారు. భవిష్యత్ భారత్ నిర్మాతలు వారేనని పేర్కొన్నారు.
దేశ స్వప్నాన్ని యువత సాకారం చేస్తుందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. జీవితం చాలా పరీక్షలు పెడుతోందని, అన్నింటిలో నెగ్గాలని సూచించారు. ఎన్ని కష్టాలు వచ్చినా అనుకున్న లక్ష్యం సాధించాలన్నారు. ప్రతి తరానికి ఆయా కాలాలకు సంబంధించిన ప్రత్యేక సవాళ్లు ఉంటాయని, అలాగే వారిపై నిర్దిష్టమైన జాతీయ బాధ్యత ఉంటుందన్నారు. ‘‘మీ జీవితాల్లోని రాబోయే 30 నుండి 35 ఏళ్లలో మీరు చేసే పనులు ‘వికసిత్ భారత్’ దిశగా మన ప్రయాణాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి, మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రాతిపదిక ఇలా ఉండాలి: దీనివల్ల దేశానికి కలిగే ప్రయోజనం ఏమిటి? ఇది దేశం ఏ అవసరాలను తీరుస్తుంది? అన్నారు.
PM Modi IIT Delhi | వారే విజయం సాధిస్తారు

ప్రపంచ వ్యూహాత్మక సమీకరణాలు వేగంగా మారుతున్నాయని మోదీ పేర్కొన్నారు. రాబోయే 20 లేదా 30 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉంటుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేరన్నారు. నిరంతరం నేర్చుకునేవారే విజయం సాధిస్తారని స్పష్టం చేశారు. చాలా మంది విద్యార్థులు తమ విజయాలకు పతకాలు అందుకున్నారని, వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ‘‘ఈ రోజు మీ కుటుంబాలు ఎలాగైతే గర్వపడుతున్నాయో, నేను కూడా మీ అందరి పట్ల గర్వపడుతున్నాను.” అని ప్రధాని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Chamba Bus Accident | ప్రైవేట్ బస్సు బోల్తా.. 8 మంది మృతి