అక్షరటుడే, వెబ్డెస్క్ : UPI Payments Free | యూపీఐ పేమెంట్లపై కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వినియోగదారులు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
యూపీఐ వినియోగం కోసం ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని ఇటీవల ఆర్బీఐ (RBI) గవర్నర్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో వినియోగదారులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నిర్దిష్ట పరిమితికి మించిన పరిమిత సంఖ్యలో యూపీఐ వ్యాపార లావాదేవీలపై నామమాత్రపు మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR)ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. అయితే వినియోగదారులు, వ్యక్తిగత చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయని హామీ ఇచ్చింది.
UPI Payments Free | చాలా తక్కువ
యూపీఐపై భవిష్యత్తులో విధించే ఏ MDR అయినా అన్ని వ్యాపార లావాదేవీలపై వర్తించదని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఈ మొత్తం డెబిట్, క్రెడిట్ కార్డు చెల్లింపులకు వర్తించే ఛార్జీల కంటే చాలా తక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. యూపీఐ లావాదేవీలలో ‘అత్యధిక శాతం’ వ్యాపారులకు ఉచితంగానే ఉంటాయని, ఒకవేళ ఏదైనా MDR ప్రవేశపెట్టినా, అది అన్నింటికీ వర్తించేలా కాకుండా పరిమితి ఆధారితంగా ఉంటుందని కూడా ఆ ప్రకటనలో పేర్కొంది. యూపీఐ చెల్లింపులకు సంబంధించిన సవరణ బిల్లును ఇటీవల పార్లమెంట్ ఆమోదించింది. ప్రతిపాదిత సవరణ అనేది ఒక సాధికారిక నిబంధన మాత్రమేనని, దీని అర్థం సాధారణ UPI వినియోగదారులపై ఛార్జీలు (UPI Payments Free) విధించడం కాదని ప్రభుత్వం నొక్కి చెప్పింది. యూపీఐ వ్యవస్థను బలోపేతం చేయడం కోసమే సవరణలు చేశామని తెలిపింది.
✅ No Charges for UPI Users
✅ Vast Majority of the Transactions to Remain Free of Charge for Merchants as well
✅ Amendment to the Payment and Settlement Systems Act (PSS Act) an Enabling Provision to Ensure further proliferation of Financial Inclusion, UPI’s Long-Term… pic.twitter.com/b6QYTgiw8a
— Ministry of Finance (@FinMinIndia) August 8, 2026
దీనిని కూడా చదవండి : Hyderabad Traffic Restrictions | హైదరాబాద్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు