Weather Update | నేడు పలు జిల్లాలకు వర్షసూచన

తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Weather Update | తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాల్లో సోమవారం మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ వాన దంచి కొట్టింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలోని సంగారెడ్డి, వికారాబాద్​, రంగారెడ్డి, మెదక్​, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు జల్లులు కురుస్తాయి. సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉటుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు జల్లులు పడే ఛాన్స్​ ఉంది. మిగతా జిల్లాల్లో చెదురుమొదురు వానలు పడతాయి. హైదరాబాద్​ నగరంలో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయి.

Weather Update | అన్నదాతల హర్షం

రాష్ట్రంలో గత 15 రోజులుగా కురుస్తున్న వానలతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎల్​నినో ప్రభావంతో వర్షాలు పడవని అధికారులు మొదట్లో చెప్పారు. వారి చెప్పినట్లే జులై 20 వరకు వానలు లేకపోవడంతో పంటలు సాగు చేయడానికి అన్నదాతలు ఆలోచించారు. వేసిన పంటలు ఎండుముఖం పట్టాయి. భూగర్భ జలాలు తగ్గిపోయాయి. ఈ సమయంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వరినాట్లు పూర్తయ్యాయి. ఈ వర్షాలతో వానాకాలం పంటలకు ఢోకా లేకుండా పోయిందని రైతులు పేర్కొంటున్నారు.

Weather Update | జలకళ

వర్షాలు లేక 20 రోజుల క్రితం తెలంగాణలోని ప్రాజెక్టులు డెడ్​ స్టోరేజీకి చేరుకున్నాయి. చెరువులు అడుగంటాయి. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలతో చెరువులు, జలాశయాలకు జలకళ వచ్చింది. చెరువులు నిండుకుండలా మారాయి. జలాశయాలకు వరద వస్తోంది. గోదావరిపై గల శ్రీరాం సాగర్​ 40 టీఎంసీలకు చేరగా.. ఎల్లంపల్లి నిండింది. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు నిండాయి. మరోవైపు కృష్ణానదిపై గల జూరాల నిండగా.. శ్రీశైలం త్వరలో నిండనుంది.

ఇది కూడా చదవండి..: Nagarjuna Sagar Varuna Yagam | నాగార్జునసాగర్‌లో సోమవారం వరుణయాగం..పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్‌

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *