తెలంగాణTelangana Rain Alert | తెలంగాణలో మళ్లీ వర్షాలు..

Telangana Rain Alert | తెలంగాణలో మళ్లీ వర్షాలు..

రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Rain Alert | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఇటీవల అకాల వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడినా.. మూడు రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు.

ఈ నెల 27 నుంచి 30 మధ్య తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. పలు చోట్ల 44 నుంచి 46 డిగ్రీల టెంపరేచర్​ నమోదు అవుతుంది. అదే సమయంలో దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్​ నగరంలో సైతం చిరుజల్లులు కురుస్తాయి.

heatwave 1

Telangana Rain Alert | మే నెలలో..

రాష్ట్రంలో మే 1 నుంచి 3 వరకు ఎండ తీవ్రత (Heat Wave) అధికంగా ఉంటుంది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకుంటాయి. మే 4 నుంచి 8 వరకు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే పలు ప్రాంతాల్లో ఎండలు కొనసాగుతాయి. రానున్న పది రోజులు ఎండలు, వర్షాలు ఉంటాయి. దీంతో రైతులు జాగ్రత్తగా ఉండాలి. తమ పంటలు తడవకుండా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ధాన్యం ఆరబోసిన రైతులు టార్పాలిన్లు కప్పుకోవాలి.

దీనిని కూడా చదవండి : BRS Formation Day | పల్లె నుంచి పట్నం వరకు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలి: కేటీఆర్​

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....

Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Modi UAE Visit | ఐరోపా దేశాల్లో వచ్చే నెల...

IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల బదిలీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)...