అక్షరటుడే, వెబ్‌డెస్క్: Paytm Share Price | ఇటీవల కేంద్ర ప్రభుత్వం యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ చార్జీలు విధించేందుకు ఉద్దేశించిన బిల్లును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చార్జీలు 2027-28 ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఎండీఆర్ చార్జీలు పేటీఎంకు పాజిటివ్ గా మారనున్నాయి. ఈ చార్జీలు అమలులోకి వస్తే పేటీఎం నికర పేమెంట్ మార్జిన్లు 3 నుంచి 4 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
Paytm Share Price | భారీగా పెరిగిన షేరు..
ఎండీఆర్ చార్జీలు (MDR Charges) అమలులోకి వచ్చే అవకాశాలు ఉండడంతో పేటీఎం షేర్లు పరుగులు తీస్తున్నాయి. సోమవారం ఉదయం రూ. 1,445 వద్ద ట్రేడింగ్ ప్రారంభమవగా.. కొద్ది సేపటికే పైకి దూసుకెళ్లింది. ఇంట్రాడేలో సుమారు పదిన్నర పది శాతానికిపైగా లాభపడింది. సోమవారం 10 శాతం లాభంతో రూ. 1,584.95 వద్ద స్థిరపడింది. షేరు ధర పెరుగుదలకు బ్రేకరేజీ సంస్థలు ఇచ్చిన భారీ టార్గెట్లూ కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Paytm Share Price | ఇప్పటికీ లిస్టింగ్ ధరకు దూరంగానే..
పేటీఎం షేర్లు 2021 జూలైలో స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ. 2,150. కాగా భారీ డిస్కౌంట్ తో రూ. 1,950 వద్ద ప్రారంభమైన కంపెనీ.. ఏనాడూ లిస్టింగ్ ప్రైస్‌ను చేరుకోలేదు. 2024 ఫిబ్రవరిలో రూ. 341 కి పడిపోయింది. అప్పటినుంచి క్రమంగా కోలుకుంటూ పైకి ఎగబాకుతోంది.
ఇది కూడా చదవండి..: Iran Oil Tanker Attack | చమురు ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. హర్మూజ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు