CV Anand Warning | ఎవరా నలుగురు IPS లు.. వారి బదిలీ ఖాయమేనా..!

రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖలో అధికారుల పనితీరుపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) సీవీ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: CV Anand Warning | రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖలో అధికారుల పనితీరుపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) సీవీ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొందరు అధికారుల పనితీరులో మార్పు రావాలని, ఎంత చెప్పినా వారిలో ఎలాంటి స్పందన కన్పించడం లేదని ఆయన తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

CV Anand Warning | కఠిన చర్యలు తప్పవు..

“ఇప్పటికే ముగ్గురు, నలుగురు అధికారులను గుర్తించాం. వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా వారిలో మార్పు రాకపోతే తప్పకుండా చర్యలు తీసుకుంటాం” అని ఆయన స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశామని, ఇకపై కూడా పనితీరు మారకపోతే కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. ఈ పరిణామంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అసలు ఆ నలుగురు అధికారులు ఎవరనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి:  Molbio Diagnostics IPO | డయాగ్నోస్టిక్స్ కంపెనీ ఐపీవో ప్రారంభం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *