Indiramma Houses Scheme | అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం : మంత్రి పొంగులేటి

అర్హులైన పేదలందిరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Indiramma Houses Scheme | అర్హులైన పేదలందిరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti) తెలిపారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో సోమవారం 394 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు ఆయన అందజేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలను పేదల ముంగిటకే తీసుకువెళ్తోందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న సుమారు 35,000 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నామని ఆయన చెప్పారు. ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద మొదటి దశలో 4.5 లక్షల ఇళ్లు, రెండో దశలో 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. మూడు, నాలుగో దశల్లో మరిన్ని ఇళ్లను మంజూరు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.

Indiramma Houses Scheme | పక్షపాతం లేకుండా..

ప్రతి ఇందిరమ్మ ఇంటికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకే నేరుగా దశలవారీగా జమ చేస్తున్నామని మంత్రి వివరించారు. పక్షపాతం లేకుండా అర్హులకే ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు మంత్రులు గుడూరు గ్రామంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : Shabbir Ali Kamareddy | కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు దక్కుతుంది: షబ్బీర్​ అలీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *