SIR Telangana | రాష్ట్రంలో ముగిసిన ఎస్​ఐఆర్​.. కోటి ఓట్లు తొలగించే అవకాశం

రాష్ట్రంలో ఎస్​ఐఆర్​ ప్రక్రియ ముగిసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : SIR Telangana | రాష్ట్రంలో ఎస్​ఐఆర్​ ప్రక్రియ ముగిసింది. ఎన్యుమరేషన్​ ఫారాల పంపిణీ, స్వీకరణ, ఆన్​లైన్​లో నమోదు ముగియడంతో ఓటర్ల లెక్క తేలనుంది. ఎన్నికల సంఘం (Election Commission) త్వరలో ముసాయిదా జాబితాను విడుదల చేయనుంది.

రాష్ట్రంలో ఎస్​ఐఆర్​ ప్రక్రియ జూన్​ 25న ప్రారంభం అయింది. బీఎల్​వోలు ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్​ ఫారాలను పంపిణీ చేశారు. అనంతరం ఓటర్లు వాటిని నింపి బీఎల్వోలకు అందించగా.. వారు ఆన్​లైన్​లో నమోదు చేశారు. ఎన్యుమరేషన్​ ఫారాలు తిరిగి ఇవ్వని వారు ఓట్లు తొలగించనున్నారు. అంతేగాకుండా ఫారాలు ఇచ్చి వివరాలు సరిగా లేని ఓట్లు సైతం పోనున్నాయి. రాష్ట్రంలో మొత్తంగా కోటికి పైగా ఓట్లు తొలగించనున్నట్లు సమాచారం.

SIR Telangana | ఎస్​ఐఆర్​ వివరాలు

రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. వీరికి ఎన్యుమరేషన్​ ఫారాలు పంపిణీ చేశారు. ఇందులో 2,64,87,214 (78శాతం) ఎన్యుమరేషన్​ ఫారాలను డిజిటలైజ్​ చేశారు. 9,22,230 మంది ఓటర్లు చనిపోయినట్లు గుర్తించారు. వీరి ఓట్లు తొలగించనున్నారు. 11,25,546 మంది ఓటర్లను అధికారులు గుర్తించలేకపోయారు. 45,18,961 మంది శాశ్వతంగా వలస వెళ్లారు. వీరి ఓటు హక్కును తొలగించనున్నారు. అంతేగాకుండా ఫారాలు సక్రమంగా నింపని వారు, 2002 సర్​ జాబితాతో మ్యాపింగ్​ చేయని వారి ఓట్లు సైతం పోనున్నాయి. ముసాయిదా జాబితా అనంతరం వీరికి అధికారులు నోటీసులు ఇస్తారు. సంబంధిత పత్రాలు సమర్పిస్తే వీరి ఓటు హక్కును కొనసాగిస్తారు. లేదంటే తొలగిస్తారు. చాలా వరకు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉన్నవారిని ఓట్లు పోనున్నాయి.

ఇది కూడా చదవండి..: Srisailam Project Flood | శ్రీశైలం ప్రాజెక్ట్​కు తగ్గిన వరద

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *