Junior Colleges TC Issue | టీసీలివ్వకుండా వేధిస్తున్న జూనియర్​ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి

టీసీలు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్న జూనియర్​ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి ప్రతినిధులు డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​ అర్బన్​: Junior Colleges TC Issue | టీసీలు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్న జూనియర్​ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఇందూర్ (Nizamabad) వినియోగదారుల సంక్షేమ సమితి ప్రతినిధులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు మంగళవారం ఇంటర్మీడియట్​ కార్యాలయ (Intermediate education) అధికారికి వినతిపత్రం అందజేశారు.

Junior Colleges TC Issue | అదనపు రుసుము వసూలు చేస్తున్నారు..

ఈ సందర్భంగా వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, నిజామాబాద్ జోనల్ కన్వీనర్ సందు ప్రవీణ్ మాట్లాడుతూ.. నగరంలోని గంగాస్థాన్ ప్రాంతంలో ఉన్న కళాశాలలతో పాటు మరికొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు విద్యార్థులకు ఫీజు బకాయిల పేరుతో టీసీలు, ఇతర విద్యా ధ్రువపత్రాలను ఇవ్వట్లేదన్నారు. దీంతో వారు పైచదువులకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. సర్టిఫికెట్​ ఇవ్వాలంటే డబ్బులు అడుగుతున్నారని.. ఫీజులు కట్టలేదని సైతం సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని ఆరోపించారు.

Junior Colleges TC Issue | అనుమతులు లేకున్నప్పటికీ..

జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల విషయంలో ఫైర్ సేఫ్టీ, మున్సిపల్ శాఖ, ప్రభుత్వ అనుమతులు లేకున్నప్పటికీ దర్జాగా ఫీజులు వసూలు చేస్తున్నారని.. అధికారులు తనిఖీలు నిర్వహించాలని వారు డిమాండ్​ చేశారు. అపార్ట్​మెంట్లలో గాలి ఆడని గదుల్లో విద్యాబోధనకు అధికారులు ఎలా అనుమతి ఇస్తున్నారని వారు ప్రశ్నించారు. అధికారులను కలిసిన వారిలో ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి అధ్యక్షుడు పెందోట అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు వీఎన్ వర్మ, రూరల్ అధ్యక్షుడు యాటకర్ల దేవేష్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: KBR Park One Way | కేబీఆర్​ పార్క్​ చుట్టూ వన్​ వే అమలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *