Ear Infection Symptoms | చెవిలో చీము వస్తుంటే అలర్ట్​ కావాల్సిందే..

చెవిలో చీము కారడం, నొప్పి వస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్‌కు ఈఎన్​టీ సర్జన్ అలోక్ ఎన్ రాఠి సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Ear Infection Symptoms | చెవిలో చీము కారడం, తరచూ చెవి నొప్పి రావడం వస్తుంటే భవిష్యత్తులో వినికిడి సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్‌కు  (Medicover Hospitals Nizamabad) ఈఎన్​టీ (ENT) సర్జన్ అలోక్ ఎన్ రాఠి సూచించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు.

Ear Infection Symptoms | చెవిలో ఇన్​ఫెక్షన్​..

చెవిలో చీము కారడం వెనుక ఇన్ఫెక్షన్, మధ్య చెవిలో ఇన్ఫెక్షన్, చెవిపొరలో రంధ్రం లేదా ఇతర చెవి సంబంధిత సమస్యలు ఉండవచ్చని వైద్యుడు అలోక్​ తెలిపారు. ముఖ్యంగా సమస్య పదేపదే వస్తున్నా లేదా చాలా కాలంగా కొనసాగుతున్నా తప్పనిసరిగా ఈఎన్​టీ నిపుణుడిని సంప్రదించి చెవిని పరీక్షించించుకోవాలని సూచించారు. అయితే మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్‌లో చెవి, ముక్కు, గొంతు సంబంధిత సమస్యలకు ఆధునిక వైద్య సదుపాయాలతో సమగ్ర సేవలు అందుబాటులో ఉన్నాయని ఆయన సూచించారు. రోగి సమస్యను బట్టి ఈఎన్​టీ పరీక్షలు, వినికిడి పరీక్షలు, ఆధునిక డయాగ్నస్టిక్ సదుపాయాలు, అవసరమైన శస్త్రచికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమైన రోగులకు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ, క్రిటికల్ కేర్, 24 గంటల అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండటం వల్ల సంక్లిష్టమైన కేసులకు కూడా సమగ్ర వైద్యం అందించే అవకాశం ఉందన్నారు.

Ear Infection Symptoms | వైద్యుల సలహా లేకుండా నూనె, చెవి డ్రాప్స్​ వేయవద్దు..

చెవిలో చీము కారుతున్న సమయంలో వైద్యుల సలహా లేకుండా నూనె, చెవి డ్రాప్స్ లేదా ఇతర పదార్థాలు వేయడం వల్ల సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వైద్యుడు అలోక్ ఎన్ రాఠి అన్నారు. సరైన కారణాన్ని గుర్తించిన తర్వాతే తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. పిల్లలకు తరచుగా చెవి ఇన్ఫెక్షన్లు రావడం, చెవిలో చీము కారడం, పిలిచినా స్పందించకపోవడం, టీవీ లేదా మొబైల్ శబ్దాన్ని ఎక్కువగా పెట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు.

ఇది కూడా చదవండి: Mumbai Landslide | ముంబైలో విరిగిపడిన కొండచరియలు.. ఇద్దరు దుర్మరణం..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *