అక్షరటుడే, వెబ్డెస్క్: Trump Iran Talks | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌ను మరోసారి గట్టిగా హెచ్చరించారు. ఆ దేశంతో జరుగుతున్న చర్చలపై తమకు ఎలాంటి నమ్మకం లేదని, వారు ఎప్పుడూ అబద్ధాలే చెబుతారని ఆయన మండిపడ్డారు. హర్మూజ్ జలసంధిపై ప్రస్తుతం సంపూర్ణ నియంత్రణ అమెరికా చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. ఈసారి చర్చల నుంచి వెనక్కి తగ్గినా, లేదా ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ తేల్చిచెప్పారు.
Trump Iran Talks | ‘వేలా నోవా’ కార్గో నౌకపై క్షిపణి దాడి..
హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఒమన్ సమీపంలో ఇరాన్ రేవుల దిగ్బంధనాన్ని ఉల్లంఘించిందన్న కారణంతో పనామా జెండా కలిగిన ‘వేలా నోవా’ కార్గో నౌకపై అమెరికా నావికాదళం దాడికి దిగింది. యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించిన వివరాల ప్రకారం.. నౌకపై నేవీ హెలికాప్టర్ రెండు హెల్‌ఫైర్ క్షిపణులను ప్రయోగించింది. అయితే ఈ దాడిలో సిబ్బందికి ఏమైనా గాయాలయ్యాయా అనే వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.
Trump Iran Talks | విపరీతమైన ఒత్తిడి..
హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పనామా కాలువలో నౌకల రద్దీ భారీగా పెరిగినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇదే సమయంలో ఎల్‌నినో ప్రభావం వల్ల కాలువలో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో పనామా కాలువ అథారిటీ ఒక్కో వాణిజ్య నౌక నుంచి ఏకంగా 4 మిలియన్ డాలర్ల రుసుము వసూలు చేస్తోంది. ప్రస్తుతం ఒక భారీ నౌక పనామాను దాటాలంటే దాదాపు 10 రోజుల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇది కూడా చదవండి: Colombia Earthquake | 224కు చేరిన కొలంబియా భూకంప మృతుల సంఖ్య..నేలమట్టమైన 1600 భవనాలు