అక్షరటుడే వెబ్‌డెస్క్: Parliament Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ముగియనున్నాయి. అయితే, సమావేశాల చివరి రోజు కూడా ఉభయసభల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, నిరసనల మధ్యనే వాతావరణం వేడెక్కింది. పరస్పర ఆరోపణలతో సభలు దద్దరిల్లాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నీట్ (NEET) విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్ ఘటన, అయోధ్య రామమందిర విరాళాల చోరీ వంటి అంశాలపై విపక్షాలు వినూత్న రీతిలో కోతిబొమ్మతో ఆందోళనకు దిగాయి. విద్యార్థులపై లాఠీఛార్జ్ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబట్టాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలపై ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Parliament Monsoon Session | రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు ..
మరోవైపు, రాంచీలో విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi )సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎన్డీఏ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రాంచీ విద్యార్థుల నిరసనల వివాదంపై రాహుల్ గాంధీ ఏ విధంగా స్పందిస్తారనేది కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కాగా, సమావేశాల ముగింపు సందర్భంగా లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. సభ ముగిసే సమయానికి వందేమాతరం గీతాలాపన నిర్వహించారు.
ఇది కూడా చదవండి: Har Ghar Tiranga | ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి