అక్షరటుడే వెబ్‌డెస్క్: Amaravati farmers sacrifice | రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన అమరావతి రైతులు చేసింది కేవలం త్యాగం మాత్రమే కాదని, ప్రపంచాన్నే ఆలోజింపజేసే ఒక గొప్ప స్ఫూర్తినిచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu )ప్రశంసించారు. రాజధానిలో ‘ఇ-3 సీడ్ యాక్సెస్ రోడ్’ , బకింగ్‌హామ్ కెనాల్‌పై స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
Amaravati farmers sacrifice | దేశానికే ఆదర్శంగా నిలిచింది..
రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎక్కడనే గందరగోళం ఉండేదని, మెజారిటీ ప్రజల కోరిక మేరకు రాష్ట్ర నడిబొడ్డున అమరావతిని ఎంపిక చేశామని సీఎం తెలిపారు. నాడు ఏమవుతుందో తెలియని పరిస్థితి నుంచి నేడు స్వయంగా రాజధానిని నిర్మించుకునే స్థితికి చేరుకున్నామని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను హైటెక్ సిటీని నిర్మిస్తుంటే ఎగతాళి చేశారని, నేడు తెలంగాణ తలసరి ఆదాయంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఏమీ లేని ఆంధ్రప్రదేశ్‌కు ఒక సమర్థవంతమైన రాజధాని కావాలనే సంకల్పంతో ముందుకు వెళ్లామని చెప్పారు.
Amaravati farmers sacrifice | రైతుల భాగస్వామ్యంతో ల్యాండ్ పూలింగ్..
రాజధాని నిర్మాణంలో రైతులను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ‘ల్యాండ్ పూలింగ్’ విధానాన్ని తెచ్చామన్న సీఎం.. తనపై నమ్మకంతో కేవలం 58 రోజుల్లోనే 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారని, ఆ రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని భావోద్వేగంగా పేర్కొన్నారు. సైబరాబాద్ నిర్మాణం కోసం అమెరికా వెళ్తే, అమరావతి డిజైన్ల కోసం తొలిసారి సింగపూర్ వెళ్లానని చెప్పారు.
Amaravati farmers sacrifice | నంబర్ వన్ గ్రీన్ సిటీగా అమరావతి..
కేబుళ్లు ఏవీ పైన కనిపించకుండా, పూర్తిగా పర్యావరణహితంగా ఈ నగరాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. ఇది దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే నంబర్ వన్ గ్రీన్ సిటీగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు అమరావతిని గ్రాఫిక్స్ అని హేళన చేసిన వారు ఇప్పుడు నేరుగా వచ్చి చూస్తే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏంటో స్పష్టంగా తెలుస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: DSP Bhima Reddy | అక్రమాస్తుల కేసు.. ఏసీబీ కస్టడీకి డీఎస్పీ భీమ్‌రెడ్డి