అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad MLM Scam | హైదరాబాద్‌లో మరో భారీ ఆర్థిక మోసం వెలుగు చూసింది. మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM) పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల టోకరా జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన ఫరెవర్ లివింగ్ ఇంపోర్ట్స్ కంట్రీ సేల్స్ మేనేజర్ హరీష్ కుమార్ సింగ్లాను పోలీసులు అరెస్టు చేశారు.
Hyderabad MLM Scam | రూ.600 కోట్ల లావాదేవీలు..
పోలీసుల వివరాల ప్రకారం, ఈ మోసం ద్వారా ఏడాదిలో దాదాపు రూ.600 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. “ఈజీ మనీ”, “వర్క్ ఫ్రమ్ హోమ్” వంటి ఆకర్షణీయమైన ఆఫర్లతో యువత, గృహిణులను లక్ష్యంగా చేసుకుని భారీగా పెట్టుబడులు సేకరించినట్లు తెలుస్తోంది.
Hyderabad MLM Scam | ఆకర్షణీయ పేర్లతో పెట్టుబడుల వల
నిందితులు “స్లో ట్రాక్”, “మీడియం ట్రాక్”, “ఫాస్ట్ ట్రాక్” వంటి పేర్లతో పథకాలు రూపొందించి ప్రజలను ఆకర్షించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రారంభంలో చిన్న లాభాలు చూపించి, తరువాత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించినట్లు విచారణలో నిర్ధారణ అయింది.
Hyderabad MLM Scam | భారీగా ఆస్తుల సీజ్
ఈ కేసులో పోలీసులు ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, విలాసవంతమైన కార్లు అయిన మెర్సిడెస్ బెంజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న దాదాపు రూ.3 కోట్లను ఫ్రీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మోసం వెనుక మరికొంతమంది ఏజెంట్లు, మేనేజర్లు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
చట్టపరమైన చర్యలు
నిందితులపై తెలంగాణ డిపాజిటర్ల రక్షణ చట్టం, ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పలు ఠాణాల్లో బాధితుల ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
TRS Party Twitter Issue | కవిత పార్టీకి తొలిరోజే షాక్.. ట్విట్టర్ ఖాతా బ్యాన్!

