అక్షరటుడే,నందిపేట్: Nandipet Police Station | పోలీస్ స్టేషన్లో ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని సీపీ సాయిచైతన్య (CP Saichaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్మూర్(Armoor) డివిజన్ పరిధిలోని నందిపేట్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఆర్మూర్ డివిజన్ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
Nandipet Police Station | డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు నిఘా పెట్టాలి..
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..గంజాయి,డ్రగ్స్ అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. ఆన్లైన్ మోసాలకు గురైన బాధితులకు వెంటనే స్పందించి సహాయం అందించాలని.. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు రెచ్చగొట్టే పోస్టులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో నమోదైన వివిధ రకాల కేసులపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా హత్యా, హత్యాయత్నం, చోరీలు మహిళలపై నేరాలు, సైబర్, మోసాలు డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా, పేకాట, గుట్కా అక్రమ వ్యాపారంపై స్టేషన్ అధికారులతో వివరాలు రాబట్టారు.
పెండింగ్‌లో ఉన్న కేసులు వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరిత న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాబోయే పండుగ నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటును పటిష్టంగా నిర్వహించాలని వాహనాలను 24/7 తనిఖీలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సీసీఆర్బీ ఏసీపీ గురు నాయుడు, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అంజయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఎస్సై వినయ్, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Nandipet Police Station, CP Saichaitanya, Nizamabad Police, Nandipet News, Cyber Crime, Drug Control, Police Inspection, Telangana Police
ఇది కూడా చదవండి: RI Caught by ACB | లంచం తీసుకుంటూ దొరికిన ఆర్ఐ