అక్షరటుడే, వెబ్‌డెస్క్: April 27 Pre Market Analysis | అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి చర్చలు నిలిచిపోవడంతో పశ్చిమాసియాలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో మార్కెట్లు మిక్స్‌డ్‌గా స్పందిస్తున్నాయి. గత సెషన్‌లో యూఎస్ మార్కెట్లు లాభాలతో, యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ముగియగా.. సోమవారం ఉదయం ఆసియా మార్కెట్లు లాభాలతో కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో ఉండడంతో మన మార్కెట్ పాజిటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
April 27 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 1.63 శాతం, ఎస్ అండ్ పీ 0.80 శాతం పెరిగాయి. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.09 శాతం నష్టంతో ఉంది.
April 27 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.85 శాతం, యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.75 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.11 శాతం నష్టపోయాయి.
April 27 Pre Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2.60 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.33 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.48 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.28 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.21 శాతం లాభంతో కొనసాగుతుండగా.. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.49 శాతం నష్టంతో ఉంది. గిఫ్ట్ నిఫ్టీ 0.78 శాతం లాభంతో సాగుతోంది. దీంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ అప్ లో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు వరుసగా ఐదో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 8,827 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు.
- డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 4,700 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.92 నుంచి 0.78 కు పడిపోయింది.
- విక్స్ 6.04 శాతం పెరిగి 19.71 వద్ద ఉంది.
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 106.56 డాలర్లకు చేరింది.
- డాలర్ ఇండెక్స్ 98.48 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.32 వద్ద ఉన్నాయి.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 13 పైసలు బలహీనపడి 94.25 వద్ద ఉంది.
haruddin Kodandaram Oath | నేడు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయనున్న ప్రొ.కోదండరామ్, అజారుద్దీన్!

