అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirumala Darshan | తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. ఏడు కొండలపైకి చేరుకొని మొక్కులు చెల్లించుకుంటారు. భక్తుల కోసం టీటీడీ ఆన్లైన్లో దర్శనం టికెట్లను విడుదల చేస్తుంది. తాజాగా నవంబర్ కోటాకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి ఇతర టికెట్ల నవంబర్ కోటా ఆన్లైన్ బుకింగ్ తేదీలను టీటీడీ ప్రకటించింది. ఈ నెల 18న ఆర్జిత సేవలకు ఎలక్ట్రానిక్ డిప్ ప్రారంభం అవుతుంది. 20 వ తేది ఉదయం 10 గంటలకు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
Tirumala Darshan | నవంబర్ 16న పుష్పయాగం
తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 16న పుష్పయాగం నిర్వహించనున్నారు. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు యాగం సేవా టికెట్ల బుకింగ్స్ ప్రారంభం అవుతుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన ఆన్లైన్ సేవల (వర్చువల్ పాల్గొనడం) టికెట్లు ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు బుకింగ్ చేసుకోవచ్చు. నవంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు ఈ నెల 24 ఉదయం 10 గంటల నుండి బుకింగ్ ప్రారంభం అవుతుంది. వయోవృద్ధులు / దివ్యాంగుల ప్రత్యేక దర్శన కోటా కోసం అదేరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లను ఈ నెల 25న ఆన్లైన్లో విడుదల చేస్తారు.
ఇది కూడా చదవండి..: Amaravati farmers sacrifice | అమరావతి రైతుల త్యాగం ప్రపంచానికే ఒక గొప్ప స్ఫూర్తి: సీఎం చంద్రబాబు