అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bhogapuram International Airport | ఉత్తరాంధ్ర అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఈ విమానాశ్రయాన్ని (అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్) ప్రారంభించగా.. సోమవారం నుంచి కమర్షియల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
Bhogapuram International Airport | ఏటికొప్పాక బొమ్మలు బహుమతిగా ఇస్తూ..
తొలి విమానం ల్యాండింగ్: సోమవారం ఉదయం 6:45 గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో ఫ్లైట్ భోగాపూర్ ఎయిర్‌పోర్ట్‌లో మొదటిసారిగా ల్యాండ్ అయింది. ప్రయాణికులకు ఏటికొప్పాక బొమ్మలను బహుమతిగా ఇస్తూ సిబ్బంది ఘనస్వాగతం పలికారు.
మొదటి విమాన ప్రయాణం: ఆదివారం అర్ధరాత్రి సింగపూర్‌కు మొదటి ఫ్లైట్ బయలుదేరి వెళ్లింది.
రైతులకు ఉచిత ప్రయాణ సౌకర్యం: భూములు ఇచ్చిన 2,200 మంది రైతులకు ప్రభుత్వం ఉచిత విమాన ప్రయాణ హామీ ఇవ్వగా.. మొదటి రోజు 165 మంది రైతులకు ఈ అవకాశం కల్పించారు. మిగతా రైతులకు దశలవారీగా ఈ సౌకర్యం అందించనున్నారు.
ప్రయాణ సర్వీసులు: హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, చెన్నై, ముంబయి, కోల్‌కతా వంటి నగరాలకు మొదటి రోజు 31 సర్వీసులు నడిచాయి. మొదటి రోజు దాదాపు 7,000 మంది ప్రయాణించినట్లు అంచనా.
రవాణా సౌకర్యాలు: విమానాశ్రయం కోసం ఆర్టీసీ 20 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది.
ఆధునిక వసతులు: డొమెస్టిక్, ఇంటర్నేషనల్ లాంజ్‌లు, హై-స్పీడ్ వైఫై, స్మార్ట్ ట్రాలీలు, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్, కరెన్సీ ఎక్స్ఛేంజ్, మెడికల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
ACB Trap Employee | ACB Trapలో ఉద్యోగి పట్టుబడితే వెంటనే ఉద్యోగం పోతుందా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
Bhogapuram International Airport | విశాఖలో నిలిచిన వాణిజ్య సేవలు
విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ నుంచి చివరి కమర్షియల్ సర్వీస్ ఆదివారం రాత్రి 10:45 గంటలకు ఢిల్లీకి వెళ్లింది. ఇకపై విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి పౌర విమాన సర్వీసులకు (కమర్షియల్ ఫ్లైట్స్) అవకాశం ఉండదు. కేవలం సైనిక, అత్యవసర, వీఐపీ, ప్రైవేట్ జెట్ (జెనరల్ ఏవియేషన్) సేవలకే ఇది పరిమితం కానుంది.
అంతర్జాతీయ ట్రావెల్ కోడ్ VTZ ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు బదిలీ చేయబడింది.
Bhogapuram International Airport | ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్‌వే…
ఈ ఎయిర్‌పోర్ట్ యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇది ఉత్తరాంధ్రకు అభివృద్ధి గేట్‌వేగా మారుతుందని పేర్కొన్నారు.
ప్రయాణికుల ఉత్సాహం, ఎయిర్‌పోర్ట్ విశేషాలపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఇది కేవలం భవనం మాత్రమే కాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు మధ్యలో ఉండటం వల్ల ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి ఊతమిస్తుందని భావిస్తున్నారు.