Phone Prices Hike | ప్రముఖ ఫోన్​ బ్రాండ్ల ధరలకు రెక్కలు.. ఏ కంపెనీ మొబైల్స్​ ఎంత వరకు పెరిగాయంటే..

వన్‌ప్లస్ నార్డ్ 6 సిరీస్‌లోని పలు వేరియంట్ల ధరలు రూ.4 వేల వరకు పెరిగాయి. మరోవైపు వివో Y సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ధరలు కూడా రూ.4 వేల వరకు పెరిగాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Phone Prices Hike | స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు షాక్ తగిలింది. ప్రముఖ మొబైల్ బ్రాండ్లు తమ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను భారీగా పెంచాయి. ఒప్పో, వన్‌ప్లస్, iQOO, రెడ్‌మీ, వివోకు చెందిన పలు మోడళ్ల ధరలు పెరిగాయి.

Phone Prices Hike | రూ. 5 వేల వరకు పెంపు..

ఒప్పో రెనో Oppo Reno, A సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ధరలను గరిష్ఠంగా రూ.5 వేల వరకు పెంచింది. దీంతో ఈ సిరీస్‌లలోని పలు మోడళ్లను కొనుగోలు చేసే వినియోగదారులపై అదనపు భారం పడనుంది.

AI Shiva Song Balochistan | నెట్టింట మార్మోగుతున్న’శివ బోలో.. బలూచిస్తాన్ ఆజాద్’: ఏఐ సృష్టించిన అద్భుత ఆధ్యాత్మిక, సాంస్కృతిక గీతం!

iQOO కూడా తన ప్రముఖ మోడళ్ల ధరలను పెంచింది. iQOO 15 ధర రూ.13 వేల వరకు, iQOO 15R ధర రూ.9 వేల వరకు పెరిగింది.

ఇక రెడ్‌మీ టర్బో-5 ధరను రూ.4 వేల వరకు పెంచగా, POCO X8 Pro, X8 Pro Max మోడళ్ల ధరలను రూ.3 వేల వరకు పెంచినట్లు సమాచారం.

Phone Prices Hike | వన్‌ప్లస్ నార్డ్ 6 సిరీస్‌లో..

వన్‌ప్లస్ నార్డ్ 6 సిరీస్‌లోని పలు వేరియంట్ల ధరలు రూ.4 వేల వరకు పెరిగాయి. మరోవైపు వివో Y సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ధరలు కూడా రూ.4 వేల వరకు పెరిగాయి.

ప్రముఖ బ్రాండ్లకు చెందిన పలు మోడళ్ల ధరలు ఒకేసారి పెరగడంతో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులు ధరలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *