Telangana Weather | అల్ప పీడన ప్రభావం.. నేడు రాష్ట్రానికి వర్ష సూచన

తెలంగాణలో మంగళవారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Weather | తెలంగాణ (Telangana)లో మంగళవారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జార్ఖండ్​లో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయన్నారు.

రాష్ట్రంలోని ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​, నిర్మల్​, నిజామాబాద్​, కామారెడ్డి, మెదక్​, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, వికారాబాద్​, రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాల్లో సాయంత్రం, రాత్రి పూట వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది.

Telangana Weather | దంచికొట్టిన వాన

పలు జిల్లాల్లో సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. ఎల్​నినో ప్రభావం ఉన్నప్పటికి ఈ ఏడాది మెదక్​, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు భారీగానే పడుతున్నాయి. మిగతా జిల్లాల్లో లోటు వర్షపాతం ఉన్నా.. ఈ జిల్లాల్లో మాత్రం జూలై 20 తర్వాత విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Lingampet Husband Attack | భర్త ఘాతుకం.. భార్యపై అర్ధరాత్రి కత్తితో దాడి

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *