Sai Durgha Tej Kanipakam | ఆలయంలో సెలబ్రిటీ బర్త్‌డే పార్టీ.. నిబంధనలు గాలికొదిలేశారంటూ విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Sai Durgha Tej Kanipakam | ఆంధ్రప్రదేశ్‌లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. మెగా హీరో సాయి దుర్గా తేజ్ స్వామివారిని దర్శించుకునేందుకు కాణిపాకం వెళ్లారు. ప్రత్యేక పూజలు ముగించుకుని గెస్ట్ హౌస్‌లో ఉన్న సమయంలో.. ఆగస్ట్ 22న జరగనున్న మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి జరుపుకున్నారు.

ఈ వేడుకలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో భక్తులు, నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పవిత్రమైన దేవుడి సన్నిధిలో ఇలాంటి పాశ్చాత్య సంస్కృతికి సంబంధించిన వేడుకలు నిర్వహించడం ఆలయ సాంప్రదాయాలకు, నిబంధనలకు విరుద్ధమని భక్తులు మండిపడుతున్నారు.

Sai Durgha Tej Kanipakam | అధికారుల వైఖరిపై విమర్శలు..

మరోవైపు ఈ విషయంలో ఆలయ అధికారుల తీరుపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ భక్తులకు కఠిన నిబంధనలు అమలు చేసే అధికారులు.. సెలబ్రిటీల విషయంలో వాటిని పక్కన పెడుతున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఆలయ గెస్ట్ హౌస్‌లో కేక్ కటింగ్ చేయడానికి అనుమతులు ఎలా ఇచ్చారంటూ అధికారులను నిలదీస్తున్నారు. సామాన్యులకు ఒక న్యాయం, సెలబ్రిటీలకు మరొక న్యాయమా అని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. పవిత్రతకు భంగం కలిగించిన వారిపై, ఇందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇది కూడా చదవండి:  Harish Rao 22A | భూములను నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టారు : హరీశ్​రావు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *