Sex Determination Tests | లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్​

లింగనిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్​ సెంటర్లపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Sex Determination Tests | లింగనిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్​ సెంటర్లపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. కలెక్టరేట్​లో గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం జరిగింది.

Sex Determination Tests | కమిటీ పనితీరుపై అసంతృప్తి

కలెక్టర్​ (Collector Bhavesh Mishra) మాట్లాడుతూ.. గర్భస్థపూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లా స్థాయి సలహా సంఘం ఆశించిన స్థాయిలో పనిచేయట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నామ్ కే వాస్తేగా సమావేశాలు నిర్వహించి తీర్మానాలు రాసుకోవడంతోనే సరిపెట్టుకోకుండా, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న స్కానింగ్ కేంద్రాలపై క్షేత్ర స్థాయిలో గట్టి నిఘా ఉంచాలని అన్నారు. జనన వివరాలను అనుసరిస్తూ ఆడ, మగ నిష్పత్తిలో ఎక్కువ వ్యత్యాసం ఉంటే, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ, భ్రూణ హత్యలు జరుగుతున్నట్లు భావించాల్సి వస్తుందన్నారు. ఈ తరహ వ్యత్యాసం ఎక్కువగా నగరాలు, పట్టణ ప్రాంతాలలోనే కనిపిస్తోందని, దీనిని బట్టి గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు జరుగుతున్నట్లు తెలుస్తోందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో గట్టి నిఘా ఉంచితే ఈ తరహా అమానవీయ ఘటనలకు ఆస్కారం ఉండదని తెలిపారు.

Sex Determination Tests | నిఘా పెట్టాలి

ఎన్ని కఠిన చట్టాలు ఉన్నా, వాటి అమలు సక్రమంగా లేకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదని కలెక్టర్​ అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇకపై జిల్లాలో ఎక్కడ కూడా లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలు జరుగకుండా గట్టి నిఘా పెట్టాలని, నిబంధలను అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేయాలని, స్కానింగ్ సెంటర్లను సీజ్ చేయాలని ఆదేశించారు. గర్భం దాల్చిన నాటి నుండి గర్భిణుల వివరాలను పక్కాగా నమోదు చేయాలని, వారిలో ఎంతమందికి కాన్పు జరిగిందన్నది పరిశీలించాలన్నారు. గర్భం దాల్చిన మీదట కాన్పు జరగని కేసులను క్షుణ్ణంగా పరిశీలిస్తే, గర్భ నిర్ధారణ, గర్భ విచ్చిత్తి ఘటనలను గుర్తించేందుకు ఆస్కారం ఉంటుందని, తద్వారా ఈ చర్యలకు పాల్పడిన స్కానింగ్ సెంటర్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, ట్రైనీ కలెక్టర్ సురేష్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి రాజశ్రీ, కమిటీ సభ్యులు ఎస్.సిద్దయ్య, బి.ఆంజనేయులు  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Fake Family Certificate | నకిలీ ఫ్యామిలీ మెంబర్​ సర్టిఫికెట్​తో దర్జాగా ఇంటిరుణం.. తమ్ముడిపై అన్న ఫిర్యాదు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *