Bengaluru Double Murder | స్నాప్‌చాట్ ప్రేమాయణం.. కన్న కొడుకును, భర్తను హతమార్చిన కసాయి తల్లి

బెంగళూరులో ప్రియుడితో కలిసి భర్తను, కన్న కొడుకును కడతేర్చిందో కసాయి తల్లి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bengaluru Double Murder | బెంగళూరులో ప్రియుడితో కలిసి భర్తను, కన్న కొడుకును కడతేర్చిందో కసాయి తల్లి. స్నాప్‌చాట్ పరిచయం కారణంగా ప్రాణాలు తీసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు అభినందన్, హరిణి దంపతులకు 2021లో వివాహం కాగా, కొన్నేళ్లుగా వీరి మధ్య మనస్పర్థలు ఉన్నాయి. దీంతో గత రెండేళ్లుగా ఇద్దరూ వేర్వేరు గదుల్లో నిద్రపోతున్నారు. 2024 డిసెంబర్‌లో స్నాప్‌చాట్ (Snap Chat) ద్వారా హరిణికి వినయ్ పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన అభినందన్, కాల్ డేటా రికార్డుల (CDR) కోసం పోలీసులను కూడా ఆశ్రయించాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి.

Bengaluru Double Murder | పక్కా ప్లాన్‌తో హత్యలు..

తమ సంబంధానికి అభినందన్ అడ్డుగా ఉన్నాడని భావించిన హరిణి, వినయ్‌తో కలిసి అతడిని హత్య చేయడానికి పథకం ప్లాన్ చేసింది. హత్య సమయంలో ఎలాంటి సాక్ష్యాలు దొరక్కుండా ఉండేందుకు హరిణి ముందుగానే రెండు జతల హ్యాండ్ గ్లౌజులను కొనుగోలు చేసింది. హత్యకు ముందే ఇంట్లోని సీసీటీవీ (CCTV) కెమెరాలను ఆఫ్‌ చేశారు. ఆగస్టు 14న దంపతుల మధ్య తీవ్ర గొడవ జరగడంతో, ఆ తర్వాత రోజు హరిణిని ఆమె పుట్టింట్లో దించి వెళ్లాడు అభినందన్. అయితే ఆదివారం సాయంత్రం ఆమెను మళ్లీ ఇంటికి తీసువచ్చాడు. అదే రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో వినయ్ రహస్యంగా ఇంటికి వచ్చాడు. రాత్రి 11:30 గంటల సమయంలో అభినందన్ నిద్రపోయాడో లేదో హరిణి పలుమార్లు నిర్ధారించుకుంది.

Bengaluru Double Murder | కన్నకొడుకును కడతేర్చిన వైనం..

అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో హరిణి, వినయ్ గ్లౌజులు ధరించి అభినందన్ గదిలోకి వెళ్లారు. వినయ్ అభినందన్ గొంతు నులిమి ఊపిరాడకుండా చేస్తుండగా, హరిణి అతడి కాళ్లను గట్టిగా పట్టుకుంది. ఈ ఘటనలో వచ్చిన శబ్దాలకు వారి ఐదేళ్ల కుమారుడు నిద్రలేచాడు. విషయం బయటపడుతుందనే భయంతో కన్న కొడుకని కూడా చూడకుండా ఆ పసిగుడ్డును కూడా తల్లి హరిణే గొంతు నులిమి హత్య చేసింది.

Bengaluru Double Murder | పోలీసుల విచారణలోని నిజాలు..

సోమవారం ఉదయం హరిణి స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి తన భర్త, కొడుకు స్పందించడం లేదని డ్రామా ఆడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. విచారణ సమయంలో హరిణి పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులదైన శైలిలో విచారించారు. దీంతో ప్రియుడు వినయ్‌తో కలిసి తామే ఈ హత్యలు చేసినట్లు అంగీకరించింది. నిందితుడు వినయ్‌ను కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ నాగేష్ తెలిపారు.

ఇది కూడా చదవండి: Bajireddy Govardhan | సీఎం రేవంత్ రెడ్డిని పడగొట్టేది ఎమ్మెల్యేలే : మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *