అక్షరటుడే, వెబ్డెస్క్: Sowcar Janaki Health | సీనియర్ నటి షావుకారు జానకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సమస్యలతో వారం రోజుల క్రితం ఆమె ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం రాత్రి రాత్రి ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నారు.
జానకీ 1950లో షావుకారు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. దీంతో ఆమెకు అదే ఇంటి పేరుగా మారిపోయింది. దాదాపు 400 సినిమాల్లో ఆమె నటించారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని రాజమండ్రిలో ఆమె 1931లో జన్మించారు. చిన్ననాటి నుంచే రంగస్థల నాటకాలలో పలు పాత్రలు పోషిస్తూ నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆమె తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లో నటించారు. మూడు హిందీ సినిమాలు, ఒక మళయాల చిత్రంలోనూ యాక్ట్ చేశారు. తెలుగు హీరోయిన్ కృష్ణకుమారి షావుకారు జానకి సొంత చెల్లెలు.
Sowcar Janaki Health | అనేక పురస్కారాలు
జానకి జాతీయ ఫిల్మ్ అవార్డులకు, తెలుగు సినిమా అవార్డులకు కమిటీలో జ్యూరీ సభ్యురాలిగా పని చేశారు. అప్పటి అందరు ప్రముఖ నాయకుల సరసన నటించింది. అనేక పురస్కారాలు పొందింది. ఆమె నటించిన షావుకారు, డాక్టర్ చక్రవర్తి (1964), మంచి మనసులు (1962), రోజులు మారాయి (1955)గా సూపర్ హిట్ అయ్యాయి. జానకి సత్యసాయి భక్తురాలు. లేటేస్ట్గా ఆమె 2023లో అన్ని మంచి శకునాలే అని మూవీలో నటించారు.
ఇది కూడా చదవండి..: Movie Ticket Prices | సినిమా టికెట్లకు కొత్త ధరలు.. చిన్న సినిమాలకు ప్రోత్సాహం