అక్షరటుడే, వెబ్‌డెస్క్: AP DSC Irregularities | ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శలు చేశారు. డీఎస్సీలో అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆరోపించారు. ప్రశ్నిస్తే గింజుకుంటున్నారు, తప్పు ఒప్పుకోవడం లేదన్నారు.
డీఎస్పీపై గురువారం వైఎస్ జగన్ (YS Jagan) మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు , లోకేష్ మైండ్‌లో చిప్‌లు ఉన్నాయా? లేదా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ రాయకుండానే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారని ఆరోపించారు. తమకు కావాల్సినవారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఇచ్చుకున్నారని పేర్కొన్నారు. డీఎస్సీ పరీక్ష లేకుండా 372 ఉద్యోగాలు ఇచ్చారన్నారు.
AP DSC Irregularities | చంద్రబాబుకు భయం పట్టుకుంది
కూటమి నాయకులు అసెంబ్లీలో మాట్లడతారు కానీ కౌన్సిల్‌లో మాట్లాడరని జగన్ అన్నారు. అందరికీ అర్థమవుతుందనే మండలిలో చర్చించడం లేదని విమర్శించారు. తప్పులను ప్రతిపక్షం ఎత్తిచూపుతుందని సీఎం చంద్రబాబుకు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. డీఎస్సీ పేపర్ తయారీ, పరీక్షల నిర్వహణ ఒకే అధికారి చేతిలో పెట్టారన్నారు. దీంతోనే అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. డీఎస్సీ పేపర్ తయారు చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ఆ తర్వాత నవీన్ పేరు తీసేసి సెకండ్ మెరిట్ లిస్ట్ ఇచ్చారన్నారు.
ఇది కూడా చదవండి..: YSRCP Assembly Boycott | జగన్‌కు అసలు రాజకీయాలు అవసరమా?: సీఎం చంద్రబాబు