అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Gains | సానుకూల ప్రపంచ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ కోలుకుంది. నష్టాలకు తెరవేస్తూ ప్రధాన సూచీలు లాభాల బాట పట్టాయి. నిఫ్టీ ఏడు సెషన్ý తర్వాత, సెన్సెక్స్ నాలుగు సెషన్ý తర్వాత లాభాలతో ముగియడం గమనార్హం.
Stock Market Gains | యూఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్ తగ్గడంతో..
బలమైన యూఎస్ డాలర్, పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్ భారతీయ ఈక్విటీల నుంచి విదేశీ మూలధనం బయటకు వెళ్లడానికి దోహదపడ్డాయి. అయితే యూఎస్ డాలర్ ఇండెక్స్, బెంచ్‌మార్క్ పదేళ్ల బాండ్ ఈల్డ్స్‌లో తగ్గుదల ఇన్వెస్టర్లకు ఉపశమనం కలిగించింది. దీంతో ఇన్వెస్టర్లు కనిష్టాల వద్ద వాల్యూ బయ్యింగ్‌కు ఆసక్తి చూపారు.
Stock Market Gains | భారీ లాభాలతో ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) గురువారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 559 పాయింట్ల గ్యాప్ అప్‌లో ప్రారంభమై మరో 45 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 142 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 147 పాయింట్ల లాభంతో మొదటైనా కొంత కరెక్షన్‌కు గురై 42 పాయింట్లు తగ్గింది. చివరికి సెన్సెక్స్ 628 పాయింట్ల నష్టంతో 77,537 వద్ద, నిఫ్టీ 153 పాయింట్ల నష్టంతో 24,231 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Gains | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,450 కంపెనీలు లాభపడగా 1,874 స్టాక్స్ నష్టపోయాయి. 225 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 176 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 92 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 26 స్టాక్ లాభపడగా.. 4 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎటర్నల్ 2.31 శాతం, కొటక్ బ్యాంక్ 1.65 శాతం, ఐటీసీ 1.63 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.53 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.46 శాతం లాభపడ్డాయి.
Losers : టాటా స్టీల్ 0.41 శాతం, ఇండిగో 0.24 శాతం, హెచ్సీఎల్ టెక్ 0.19 శాతం, టైటాన్ 0.04 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Stock Market Gains | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. లాభాల బాటలో స్టాక్ మార్కెట్