అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rahul Gandhi Protest | లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పార్లమెంట్ స్ట్రీట్‌లోని ఒక పోలీస్ స్టేషన్లోకి పెల్లెట్ గన్ బాధితుడైన ఒక వ్యక్తితో కలిసి ధర్నా చేశారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు అక్కడినుంచి వెళ్లలని స్పష్టం చేశారు.
జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనల సమయంలో పెల్లెట్ల దెబ్బకు గురయ్యాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సాహిల్ లోచాబ్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించారు. దీంతో రాహుల్ గాంధీ పెల్లెట్ గన్ బాధితుడైన మరొక వ్యక్తితో కలిసి పోలీస్ స్టేషన్ బయట ధర్నాకు దిగారు. విద్యార్థుల ఆందోళనల సమయంలో పోలీసులు, పారామిలిటరీ బలగాలు మితిమీరి, అసమానంగా బలప్రయోగం చేశాయన్న ఆరోపణలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయినా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Rahul Gandhi Protest | అమిత్ షాకు లేఖ
అంతకుముందు రాహుల్ గాంధీ అమిత్ షాకు లేఖ రాశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన దాడికి జవాబుదారీతనం కోరారు. విద్యార్థులపై దాడికి సంబంధించిన ఫిర్యాదు కాగ్నిజబుల్ నేరానికి సంబంధించినది కావడంతో FIR నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు FIR నమోదు చేయలేదని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేసే వరకు తాము పోరాటం చేస్తామని తెలిపారు. న్యూఢిల్లీ డీసీపీ సచిన్ శర్మ రాహుల్ గాంధీతో చర్చించారు. జూలై 20న నమోదైన అన్ని కేసులపై ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే దర్యాప్తు చేస్తోందని తెలపిఆరు. బాధితుడి ఫిర్యాదును కూడా క్రైమ్ బ్రాంచ్‌కు పంపిస్తామని చెప్పారు.
ఇది కూడా చదవండి..: School Theek Karo | సీజేపీ కార్యకర్తలను తరిమికొట్టిన గ్రామస్థులు