India Pharma Healthcare Fund | భారతీయ మార్కెట్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్) , ఔషధ (ఫార్మా) రంగాల వృద్ధి అవకాశాలను మదుపర్లకు అందించేందుకు ఇన్వెస్కో ( Invesco )మ్యూచువల్ ఫండ్ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ‘ఇన్వెస్కో ఇండియా ఫార్మా అండ్ హెల్త్‌కేర్ ఫండ్’ పేరుతో ఒక కొత్త ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
India Pharma Healthcare Fund |విస్తృతమైన పెట్టుబడి విభాగాలు..
ప్రజల మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఆరోగ్య బీమా పరిధి, కొనుగోలు శక్తి పెరగడం, వృద్ధాప్య జనాభా సంఖ్య హెచ్చడం , అంతర్జాతీయంగా భారత ఫార్మా రంగానికి లభిస్తున్న ఆదరణ ఈ పథకానికి ప్రధాన చోదకాలుగా ఉన్నాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఫార్మాస్యూటికల్ కంపెనీలు, ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్స్ కేంద్రాలు, కాంట్రాక్ట్ రీసెర్చ్ & తయారీ సంస్థలు (CDMOs/CROs), వైద్య పరికరాల తయారీదారులు , ఆరోగ్య బీమా రంగాల్లో పెట్టుబడులు పెడతారు.
India Pharma Healthcare Fund | ప్రత్యేక వ్యూహం..
ఈ ఫండ్‌ను ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ ( హెడ్ ఆఫ్ ఈక్విటీ, ఫండ్ మేనేజర్ ఆదిత్య ఖేమానీ నిర్వహించనున్నారు. ఇది బీఎస్ఈ హెల్త్‌కేర్ టీఆర్ఐ సూచీని బెంచ్‌మార్క్‌గా అనుసరిస్తుంది. ఆరోగ్య రంగం ప్రస్తుతం నిర్మాణాత్మక మార్పులను చూస్తోందని, భారత్ అంతర్జాతీయ ఫార్మా, హెల్త్‌కేర్ ఆవిష్కరణల కేంద్రంగా ఎదుగుతోందని ఆదిత్య ఖేమానీ తెలిపారు. దీర్ఘకాలికంగా నాణ్యమైన కంపెనీలను ఎంచుకుని మంచి రాబడులు అందించడమే తమ వ్యూహమని పేర్కొన్నారు.
India Pharma Healthcare Fund | ఎన్‌ఎఫ్‌వో గడువు ..
ఈ న్యూ ఫండ్ ఆఫర్ (NFO) ఆగస్టు 18, 2026 నుంచి సెప్టెంబర్ 1, 2026 వరకు మదుపర్లకు అందుబాటులో ఉంటుంది. ఇందులో లంప్‌సమ్ విధానంలో కనీసం రూ. 1,000 కాగా, సిప్ (SIP) విధానంలో కేవలం రూ. 100 నుంచే పెట్టుబడి పెట్టవచ్చు. యూనిట్లు కేటాయించిన 3 నెలల లోపు వాటిని ఉపసంహరించుకుంటే 0.50 శాతం ఎగ్జిట్ లోడ్ వర్తిస్తుంది. అదే 3 నెలల తర్వాత విక్రయిస్తే ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు.
ఇది కూడా చదవండి: Kamareddy Crime Control | నేర నియంత్రణ, గంజాయి నిర్మూలనపై దృష్టి సారించాలి : డీఐజీ సన్‌ప్రీత్ సింగ్